Saturday, July 27, 2024

ఇక ముంబయి నిద్రపోదు!

- Advertisement -
- Advertisement -

Mumbai

ముంబయి: ముంబయి వాసులకు శుభవార్త. నగరంలోని షాపింగ్ మాల్స్, వీధి రెస్టారెంట్లు, చిరు దుకాణాలు ఇక రాత్రంతా కూడా తెరచి ఉంచవచ్చు. జనవరి 27వ తేదీ నుంచి అమలులోకి వచ్చే ఈ కొత్త నిర్ణయం తొలిదశలో కొన్ని నివాసేతర ప్రాంతాలలో అమలు కానున్నది. ఈ మేరకు ఉద్ధవ్ థాక్రే మంత్రివర్గం బుధవారం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ మినహాయింపు పబ్బులు, బార్లు, లిక్కర్ షాపులకు వర్తించదు. బార్లు, పర్మిట్ రూములు రాత్రి 1.30 గంటల కల్లా మూసివేయక తప్పదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాకరే తెలిపారు.

కాగా, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు రాత్రంతా తెరచి ఉంచేందుకు ఇచ్చిన అనుమతి తప్పనిసరి కాదని, అది ఆయా దుకాణదారుల ఇష్టమని ఆయన అన్నారు. లండన్‌లో రాత్రి పూట దాదాపు 500 కోట్ల పౌండ్ల ఆర్థిక లావాదేవీలు జరుగుతాయని, ముంబయిలో కూడా ఇదేరకమైన ఆర్థిక ప్రగతి సాధించగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సేవా రంగంలో ముంబయిలో దాదాపు 5 లక్షల మంది యువజనులు ఉపాధి పొందుతున్నారని, కొత్త ప్రతిపాదన వల్ల మరో 5 లక్షల మందికి ఉపాధి లభించగలదని ఆయన అన్నారు. ఈ నిర్ణయం వల్ల పర్యాటకం ఊపందుకోవడంతోపాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడి ఆర్థిక పురోగతి సాధించగలమని ఆయన అన్నారు.

Mumbai to keep open 24×7 from Jan 27, Uddhav Thakeray cabinet gave nod to open Mals and eateries day and night

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News