Saturday, July 27, 2024

నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో సినిమా

- Advertisement -
- Advertisement -

 

మాస్ మహరాజా రవితేజ వరుసగా సినిమాలను అంగీకరిస్తున్నారు. రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ రాసిన కథతో ‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ సినిమా చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు తెలిసింది. నక్కిన త్రినాథరావు సినిమా ఎప్పుడో ప్రారంభం కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. ఇక రవితేజ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం తన మాడ్యులేషన్‌తోనే అద్భుతమైన కామెడీని పండించగలడు. అయితే ‘కిక్’ తరువాత రవితేజ మళ్లీ ఆ రేంజ్ కామెడీ సినిమా చేయలేదు. అయితే తాజాగా ఈ కథానాయకుడు అలాంటి కామెడీ సినిమాతోనే మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడట. కాగా ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని… ఇందులో రవితేజ క్యారెక్టరైజేషన్ మంచి కామెడీ టైమింగ్‌తో అద్భుతంగా ఉంటుందని సమాచారం. త్రినాథరావు నక్కిన గత చిత్రాలు సినిమా చూపిస్తా మామ, నేను లోకల్ వంటి సినిమాలు కూడా మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగిన విషయం తెలిసిందే. అయితే రవితేజ… రమేష్ వర్మ డైరక్షన్‌లోనూ ఓ సినిమా చేయబోతున్నాడు. కాగా రమేష్ వర్మ సినిమా కంటే త్రినాథరావు నక్కిన సినిమానే ముందుగా మొదలవుతుందట.

Nakkina Trinadha rao to Direct Ravi Teja

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News