Friday, April 26, 2024

హార్మోన్లను బ్యాలెన్స్ చేద్దాం!

- Advertisement -
- Advertisement -

Women

 

మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత వల్ల చాలా ఇబ్బందులు వస్తుంటాయి. ఆందోళన, కోపం, నిద్రలేమి, ఆకలి విపరీతంగా అవడం లేదా అసలు తినకపోవడం, త్వరగా మూడ్స్ మారిపోవడం జరుగుతుంటాయి. సాధారణంగా మహిళల్లో స్రవించే హార్మోన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ శరీరంలోని అనేక జీవక్రియలను నిర్వహించేందుకు తోడ్పడుతుంటాయి. మరి ఇవి బ్యాలెన్స్ తప్పకుండా ఉండాలంటే రోజువారీ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుందని సూచిస్తున్నారు ఆహార నిపుణులు.

*గర్భధారణకు, మెనోపాజ్ సమయంతో పాటు మహిళల సంపూర్ణారోగ్యానికీ ఉపయోగపడే హార్మోన్ ప్రోజెస్టెరాన్. ఈ హార్మోన్ లోపిస్తే బరువు పెరగడం, పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు విటమిన్ బి6, పీచు, జింక్, మెగ్నీషియమ్ ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది. చిక్కుళ్లు (బీన్స్), బ్రొకోలీ, క్యాబేజీ, కాలీఫ్లవర్, గుమ్మడి, పాలకూర, నట్స్ వంటివి తీసుకోవాలి.

* మహిళలు వయసు పెరుగుతున్న కొద్దీ ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (ఎఫ్‌ఎస్‌హెచ్) ఎక్కువగా స్రవిస్తుంది.
* థైరాయిడ్ గ్రంథి స్రవించే హార్మోన్‌లు చాలా అవసరం. కానీ ఈ గ్రంధి మోతాదు ఎక్కువైతే హైపర్ థైరాయిడిజమ్, తక్కువైతే హైపో థైరాయిడిజమ్ వచ్చే అవకాశాలున్నాయి. ఎఫ్‌ఎస్‌హెచ్ కోసం, థైరాయిడ్ గ్రంథి చక్కగా పనిచేయడానికి ఒమెగా 3-ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. చేపలు (సాల్మన్, సార్డిన్, కొరమీను వంటివి), అవిసెగింజలు, వాల్‌నట్, కిడ్నీబీన్స్, పాలకూర వంటి ఆకుకూరల్లో ఒమెగా 3-ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.
* ల్యూటినైజింగ్ హార్మోన్ (ఎల్‌హెచ్) మహిళలకు అవసరమైన హార్మోన్. ఇది మహిళల్లో అవసరమైన ఇతర హార్మోన్లను స్రవించేలా చేస్తుంది. దీన్ని పొందాలంటే మెగా 3-ఫ్యాటీ యాసిడ్స్ లభ్యమయ్యే ప్రధాన ఆహారాలను తీసుకోవాలి. పొట్టుతీయని గింజధాన్యాలు, పప్పుధాన్యాలు అవసరం.

* ఎస్ట్రాడియాల్ మహిళలకు అవసరమైన హార్మోన్. దీన్నే ఈస్ట్రోజెన్ అని అంటారు. ఇది తగ్గడం వల్ల యోని సంబంధమైన రుగ్మతలు కనిపిస్తాయి. అవిసెగింజలు, సోయా ఉత్పాదనలు, తాజాపండ్లు, నట్స్, డ్రైఫ్రూట్స్ వంటి వాటి ద్వారా ఈస్ట్రోజెన్ స్వాభావికంగా సమకూరుతుంది. పురుషులకు అవసరమైన హార్మోన్ టెస్టోస్టెరాన్. కొద్దిపాళ్లలో మహిళల్లోనూ ఇది అవసరం. మహిళల్లో ఎముకలు, కండరాల బలం కోసం, కొవ్వు సమంగా విస్తరించడంతో పాటు రక్తకణాల ఉత్పత్తి కోసం పనిచేస్తుందిది. జింక్ వంటి ఖనిజ లవణాలు, విటమిన్ -డి లభించే పదార్థాల్లో ఈ హార్మోన్ లభిస్తుంది. కొరమీను, సాల్మన్ చేపలు, వేటమాంసం, గుడ్లు, బీన్స్‌ల ద్వారా కూడా సమకూరుతుంది. దానిమ్మలో ఎక్కువగా దొరుకుతుంది. ఆక్సిటోసిస్ అనే హార్మోన్ హైపోథలామస్ ద్వారా ఉత్పత్తి అయి, పిట్యుటరీ గ్రంథి ద్వారా విడుదల అవుతుంది.

ఇది మన సామాజిక ప్రవర్తనను ప్రభావితం చేయడంతో పాటు, సంతాన సాఫల్యానికి, బిడ్డపుట్టాక మళ్లీ పీరియడ్స్ క్రమంగా రావడానికి ఉపయోగపడుతుంది. విటమిన్- -డి ఎక్కువగా ఉండే ఆహారాలైన గుడ్లు, చికెన్, పాలు, తృణధాన్యాలతో పాటు విటమిన్ –సి పుష్కలంగా ఉండే ఉసిరి, జామ, బెర్రీపండ్లు, టోమాటో, నిమ్మలతోపాటు బాదం, అవకాడో, డార్క్‌చాక్లెట్లు, అరటిపండ్లు, పెరుగు, బ్రకోలిలో దొరుకుతుంది. మహిళల్లో గ్లూకోజ్ మెటబాలిజమ్ సక్రమంగా జరగడం అవసరం. దాని వల్ల మధుమేహానికి చెక్ పెట్టొచ్చు. మెంతులు, మెంతికూర వంటివి తీసుకోవడం ద్వారా డియోస్జెనిన్ అనే ఒక రకం ఈస్ట్రోజెన్ లభ్యమవుతుంది. దీని వల్ల గ్లూకోజ్ మెటబాలిజమ్ సక్రమంగా జరుగుతుంది. బాదం నుంచి ’ఎడిపోన్సెటిన్’ అనే స్వాభావిక ప్రోటీన్ లభ్యం కావడం వల్ల కూడా గ్లూకోజ్ మెటబాలిజమ్ సక్రమంగా జరుగుతుంది.

Hormonal imbalance in Women causes many Problems
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News