Monday, June 24, 2024

నాని ‘వి’ ట్రైలర్ విడుదల

- Advertisement -
- Advertisement -

Nani - Sudheer babu v official trailer release

హైదరాబాద్: ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో నేచురల్ స్టార్ నాని, సుధీర్‌బాబు కలిసి నటిస్తున్న ‘వి’ సిన్మా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ ట్రైలర్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. ”ఎలా ఫినిష్ చేద్దాం” అంటూ ఈ చిత్రంలో ఉన్న ఓ డైలాగ్ ను గుర్తుచేస్తూ నాని తన ట్విట్టర్ ట్రైలర్ ద్వారా రిలీజ్ చేశాడు. ఈ చిత్రంలో నివేదా థామస్‌, అదితీరావు హైదరి హీరోయిన్లుగా నటించారు. జగపతిబాబు, నాజర్, వెన్నెల కిశోర్, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సుధీర్‌బాబు పోలీసుగా ఆఫీసర్ గా నటిస్తున్నాడు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రం దిల్‌ రాజు బ్యానర్లో నిర్మిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News