Saturday, April 27, 2024

ఖేల్ రత్న రేసులో నీరజ్, మిథాలీ, ఛెత్రి

- Advertisement -
- Advertisement -

Neeraj Mithali and Chhetri among 11 recommended for Khel Ratna

అర్జున అవార్డు కోసం ధావన్, భవీనా పటేల్ నామినేట్

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న 2021 అవార్డు కోసం మొత్తం 11 మంది క్రీడాకారుల పేర్లను జాతీయ క్రీడా అవార్డుల కమిటీ నామినేట్ చేసింది. అంతేగాక అర్జున అవార్డు కోసం 35 మంది క్రీడాకారుల పేర్లను కమిటీ సిఫార్సు చేసింది. అవార్డుల కమిటీ బుధవారం నామినేట్ చేసిన ఖేల్ రత్న అవార్డు జాబితాలో టోక్యో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా, టీమిండియా మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్, ఫుట్‌బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రి తదితరులు ఉన్నారు. అంతేగాక అర్జున అవార్డు కోసం సిఫార్సు చేసిన వారిలో టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్, భవినా పటేల్ (టిటి), సింగ్‌రాజ్ అదానా (షూటింగ్) తదితరులు ఉన్నారు. కాగా ప్రతి ఏడాది జులైఆగస్టులో ఈ అవార్డులను ప్రదానం చేయడం అనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఏడాది ఒలింపిక్స్ క్రీడలు జరగడంతో దీన్ని వాయిదా వేశారు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో అసాధారణ ఆటను కనబరిచిన క్రీడాకారులను ప్రతిష్టాత్మకమైన ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు కోసం సిఫార్సు చేశారు.

అంతేగాక పారాలింపిక్స్‌లో చారిత్రక ప్రదర్శనతో భారత్‌కు పతకాల పంట పండించిన పారా అథ్లెట్ల పేర్లను కూడా ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుల కోసం కమిటీ నామినేట్ చేసింది. ఖేల్త్న్రా అవార్డు కోసం మొత్తం 11 మంది పేర్లను ప్రతిపాదించారు. వీరిలో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా (జావెలిన్ త్రో), రవి దహియా (రెజ్లర్), పిఆర్.శ్రీజేష్ ( హాకీ), లవ్లీనా బోర్గొహెన్ (బాక్సింగ్), మిథాలీ రాజ్ (క్రికెట్), సునీల్ ఛెత్రి (ఫుట్‌బాల్), ప్రమోద్ భగత్ (పారా బ్యాడ్మింటన్), సుమిత్ అంటిల్ (పారా అథ్లెట్), అవని లేఖరా (పారా షూటర్), కృష్ణా నగార్ (పారా బ్యాడ్మింటన్), నర్వాల్ (పారా షూటింగ్)లు ఉన్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో వీరంతా పతకాలు గెలిచి భారత ఖ్యాతిని ఇనుమడింప ప్రపంచానికి చాటారు. మరోవైపు అర్జున అవార్డుల జాబితాలో శిఖర్ ధావన్ (క్రికెట్), భవీనా పటేల్ (టిటి), నిషద్ కుమార్ (అథ్లెటిక్) తదితరుల పేర్లు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News