Thursday, May 2, 2024

పోడు ఆక్రమణలపై ఉక్కుపాదం

- Advertisement -
- Advertisement -

Applications for Podu lands

8 నుంచి దరఖాస్తుల స్వీకరణ : సిఎస్ సోమేశ్ కుమార్

అటవీ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో అప్లికేషన్ల స్వీకరణ
ఇకపై ఆక్రమణలు జరగొద్దు, ప్రజలను చైతన్య పరచాలి
అటవీ, రెవెన్యూ అధికారులతో సిఎస్ సుదీర్ఘ భేటీ

మన తెలంగాణ/ హైదరాబాద్: పోడుభూముల సమస్య అధికంగా ఉన్న జిల్లాలలో ప్రత్యేకాధికారులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్య పరిష్కారానికి నవంబర్ 8నుంచి దరఖాస్తులు స్వీకరించాలన్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, విధి విధానాల రూపొందించే విషయాలపై అట వీ, రెవిన్యూ ఉన్నతాధికారులతో బుధవారం ఆయన సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రిన్సిపల్ సిసిఎఫ్ ఆర్. శోభ, రెవిన్యూ శాఖ కార్యదర్శి శేషాద్రి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా, ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్‌డి ప్రియాంకవర్గీస్,ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సి.ఎస్. సోమేశ్ కుమార్ మాట్లాడుతూ పోడుభూములపై దరఖాస్తులు స్వీకరించే ముందు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ప్రజాప్రతినిధులు, ఇతర సభ్యులతో అటవీ హక్కు ల కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు.

ఈ కమిటీ ల ఆధ్వర్యంలో గ్రామాలలో దరఖాస్తుల స్వీకరణ, అందులో పొందు పరిచే ఇతర అంశాలపై చైతన్య, అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొ న్నారు. ఇకపై అటవీభూముల ఆక్రమణ ఉండదని గ్రామస్తులు అంగీకరించే విధంగా చైతన్యపర్చాల ని స్పష్టం చేశారు. డివిజన్, జిల్లా కమిటీలను ఏర్పా టు చేసి కలెక్టర్ల ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళి క రూపొందించాలని అన్నారు. ఈ మొత్తం ప్రక్రియను పారదర్శకంగా, ఏ మాత్రం వివాదాలకు తావు లేకుండా నిర్వహించాలని స్పష్టం చేశారు. అత్యధిక విస్తీర్ణం అధికంగా ఉన్న ప్రాంతాలకు సీనియర్ అటవీశాఖ అధికారులను నియమించాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ పిసిసిఎఫ్ లు స్వర్గం శ్రీనివాస్, ఎంసి పరగెన్ పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News