Monday, April 29, 2024

నా కల నెరవేరుతోంది

- Advertisement -
- Advertisement -

Interview with Heroine Ketika Sharma

 

యంగ్ హీరో ఆకాష్ పూరి, అందాల హీరోయిన్ కేతిక శర్మ కాంబోలో వస్తోన్న ‘రొమాంటిక్’ చిత్రం శుక్రవారం విడుదల కాబోతోంది. పూరి కనెక్ట్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు అనిల్ పాదురి దర్శకుడు. బుధవారం హీరోయిన్ కేతిక శర్మ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

తనకు నచ్చినట్టుగా బతికే అమ్మాయిగా…

‘రొమాంటిక్’ చిత్రంలో ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయాలనుకునే అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. సమాజంలో కట్టుబాట్ల గురించి ఆలోచించకుండా తనకు నచ్చినట్టుగా బతికే మౌనిక అనే అమ్మాయి క్యారెక్టర్‌ను ఈ సినిమాలో పోషించాను. మౌనిక ఎవరినైనా ప్రేమిస్తే.. మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది.

ఎంతో నేర్చుకున్నా…

నా మొదటి చిత్రమే పూరి కనెక్ట్ వంటి పెద్ద బ్యానర్‌లో చేయడం ఆనందంగా ఉంది. పూరి సార్ లెజెండరీ డైరెక్టర్. ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చారు. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను. నా మొదటి చిత్రంలోనే నాకు పాట పాడే అవకాశం వచ్చింది. నా వల్లే కాదే… పాట పాడాను. ఇక తెరపై నన్ను నేను చూసుకోవాలనే కల నెరవేరుతోంది.

ఛాలెంజింగ్‌గా అనిపించింది…

ఈ చిత్రంలో క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుంది. రమ్యకృష్ణ, ఆకాష్‌తో కలిసి నటించడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. మొత్తం ఔట్‌పుట్ చూశాక ఆడియన్స్‌కు నేను నచ్చుతానని అనిపించింది.

అదంతా పూరి వల్లే…

ఆకాష్ చాలా మంచి వ్యక్తి. నేను కంఫర్ట్‌గా ఫీలయ్యేలా చూసుకున్నాడు. నాకు ఈ చిత్రం ద్వారా ఆకాష్ రూపంలో ఓ మంచి ఫ్రెండ్ దొరికాడు. నాకు ఈ సినిమా విడుదల కాకముందే అవకాశాలు వచ్చాయి. అదంతా పూరి వల్లే. నాగ శౌర్యతో లక్ష్య, వైష్ణవ్ తేజ్‌తో మరో సినిమాను చేస్తున్నాను.

ఆమె అంటే చాలా ఇష్టం…

బయోపిక్స్‌లో నటించాలని ఉంది. నాకు సాయి పల్లవి అంటే చాలా ఇష్టం. ఆమె ఎంతో సహజంగా నటిస్తుంది. లవ్ స్టోరీ సినిమాను చూశాను. ఆమె చాలా చక్కగా నటించింది. ఆమె డ్యాన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె చేసే ప్రతి ఒక్కటీ నాకు ఇష్టమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News