Monday, May 5, 2025

నీట్ షిప్ట్ పరీక్షల వివాదం…. కేంద్రానికి సుప్రీం నోటీసు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : నీట్ పిజి 2025 పరీక్ష రెండు షిఫ్ట్‌ల నిర్వహణను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. దీనిపై సోమవారం అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. ఈ పిటిషన్లపై కేంద్రం ఇతర సంబంధిత పక్షాలకు నోటీసులు వెలువరించింది. తమ వివరణ ఇచ్చుకోవాలని ఆదేశించింది. ఇటీవలే కేంద్ర విద్యాశాఖ పిజి నీట్‌ను రెండు దశలుగా నిర్వహించాలని నిర్ణయించింది. సంబంధిత నోటిఫికేషన్‌ను వెలువరించింది. అయితే ఈ పరీక్షను జూన్ 15వ తేదీన ఒకే ఒక్క దశలో నిర్వహించాలని , అభ్యర్థులు పారదర్శక, సార్వత్రిక సముచిత రీతిలో పరీక్షలు రాసేందుకు ఈ సింగిల్ షిఫ్ట్ ఉపయోగపడుతుందని పిటిషనర్లు తెలిపారు. కాగా న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, కెవి విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం ఏడుగురు మెడికల్ ప్రాక్టిషనర్లు దాఖలు చేసిన పిటిషన్లను విచారించేందుకు అంగీకరించింది. సింగిల్ షిఫ్ట్ పరీక్ష, దేశవ్యాప్తంగా పరీక్షా కేంద్రాల సంఖ్య పెంపుదల చర్యల గురించి పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News