Saturday, October 12, 2024

బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం పాటలో కొత్త నిబంధన

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం పాట 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్సవ సమితి కొత్త నిబంధన తీసుకొచ్చింది. వేలంపాటలో పోటీదారులు ముందస్తుగా డబ్బులు డిపాజిట్ చేయాలని నిబంధన పెట్టింది. బాలాపూర్ లడ్డూ వేలం పాటలో స్థానికులు, స్థానికేతరుల మధ్య తీవ్రమైన పోటీ ఉండడంతో బాలాపూర్ గణేష్ కమిటీ కొత్త నిబంధన తీసుకొచ్చింది. బాలాపూర్ ముఖ్యకూడలిలోని బొడ్రాయి వద్ద గణేశుడి లడ్డూ వేలం పాట జరుగుతోంది. మంగళవారం ఉదయం 9.30 గంటలకు బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాట ప్రారంభం కానుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు ట్యాంక్ బండ్ వైపు బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభం కానుంది. 16 కిలో మీటర్ల మేర బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర జరుగనుంది. బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాటకు 220 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. రాచకొండ పోలీసులు 30 సిసి టివి కెమెరాలతో భద్రత ఏర్పాట్లు చేశారు. కేశవగిరి, చాంద్రాయణగుట్ట, చార్మినార్, ఎంజె మార్కెట్, అబిడ్స్, మీదుగా బాలాపూర్ గణేశ్ శోభాయాత్ర జరుగనుంది.

బాలాపూర్ గణేశ్ లడ్డూ 2023లో రికార్డు స్థాయిలో రూ.27 లక్షలు పలికింది. 2023లో స్థానికేతరుడైన దాసరి దయానంద్ రెడ్డికి బాలాపూర్ లడ్డూ దక్కింది. ఈ ఏడాది బాలాపూర్ గణేశ్ లడ్డూ రూ.30 లక్షలు ధర పలుకుతుందని అంచనా వేస్తున్నారు. 1994 నుంచి బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం పాట కొనసాగుతోంది. మొదటి రూ.450తో బాలాపూర్ లడ్డూ వేలం ప్రారంభమైంది.  2020లో కరోనా కారణంగా లడ్డూ వేలం పాటను రద్దు చేశారు.

బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం పాట వివరాలు:

1994లో  కొలను మోహన్‌రెడ్డి  రూ.450, 1995లో కొలను మోహన్‌రెడ్డి- రూ.4,500లు, 1996లో కొలను కృష్ణారెడ్డి- రూ.18 వేలు, 1997లో కొలను కృష్ణారెడ్డి- రూ.28 వేలు, 1998లో కొలన్ మోహన్ రెడ్డి లడ్డూ- రూ.51 వేలు, 1999 కళ్లెం ప్రతాప్ రెడ్డి- రూ.65 వేలు, 2000 కొలన్ అంజిరెడ్డి- రూ.66 వేలు, 2001 జి. రఘనందన్ రెడ్డి- రూ.85 వేలు, 2002లో కందాడ మాధవరెడ్డి- రూ.1,05,000లు, 2003లో చిగిరినాథ బాల్ రెడ్డి- రూ.1,55,000లు, 2004లో కొలన్ మోహన్ రెడ్డి- రూ.2,01,000, 2005లో ఇబ్రహీ శేఖర్- రూ.2,08,000లు, 2006లో చిగురింత తిరుపతి- రెడ్డి రూ.3 లక్షలు, 2007లో జి.రఘనాథమ్ చారి- రూ.4,15000లు, 2008లో కొలన్ మోహన్ రెడ్డి- రూ.5,07,000లు, 2009లో సరిత- రూ.5,10,000, 2010లో కొడాలి శ్రీధర్ బాబు- రూ.5,35,000లు, 2011లో కొలన్ బ్రదర్స్- రూ.5,45,000లు, 2012లో పన్నాల గోవర్ధన్ రెడ్డి- రూ.7,50,000లు, 2013లో తీగల కృష్ణారెడ్డి- రూ.9,26,000లు, 2014లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి- రూ.9,50,000లు, 2015లో కొలన్ మధన్ మోహన్ రెడ్డి- రూ.10,32,000లు, 2016లో స్కైలాబ్ రెడ్డి- రూ.14,65,000లు, 2017లో నాగం తిరుపతి రెడ్డి- రూ.15 లక్షల 60 వేలు, 2018లో తేరేటి శ్రీనివాస్ గుప్తా- రూ.16,60,000లు, 2019లో కొలను రామిరెడ్డి- రూ.17 లక్షల 60 వేలు, 2020లో కరోనా కారణంగా లడ్డూ వేలం పాట రద్దు, 2021లో మర్రి శశాంక్ రెడ్డి, ఎపి ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్- రూ.18.90 లక్షలు, 2022లో వంగేటి లక్ష్మారెడ్డి- రూ.24,60,000లు, 2023లో దాసరి దయానంద్ రెడ్డి – రూ. 27 లక్షలకు ఈ లడ్డూను దక్కించుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News