మన తెలంగాణ/సిటీ బ్యూరో: ఖైరతాబాద్ మహాగణపతి హుండీలో భారీగా విరాళం వచ్చి చేరింది. కేవలం హుండి కానుకల ద్వారా 70 లక్ష ల రూపాయల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇంకా మహాగణపతికి వద్ద ఏర్పాటుచేసిన హోర్డింగులు, ప్రకటనల ద్వారా రూ.40 ల క్షలు సమకూరినట్లు సమాచారం. భక్తులు ఆన్లైన్ ద్వారా (స్కానర్లు/ గూ గుల్ పే) పంపించిన విరాళాలు తేలాల్సి ఉంది. మొదటిసారిగా సీసీ కెమెరాల ద్వారా హుండీ లెక్కింపు చేయడం విశేషం. కొత్త కార్యవర్గ సభ్యులు ఈ ప్రక్రియ నిర్వహించడం ద్వారా భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ప్రారంభం:
ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ప్రారంభమైంది. కమిటీ సభ్యులు హారతి ఇచ్చి శోభాయాత్రను ప్రారంభించారు. మంగళవారం మధ్యాహ్నం హుస్సేన్‌సాగర్‌లోని నంబర్ నాలుగో క్రేన్ వద్ద ఖైరతాబాద్ మహాగణపతిని నిమజ్జనం చేయనున్నారు. సోమవారం ఉదయం నుంచి కర్రల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. హుస్సేన్ సాగర్ చుట్టూ భారీగా క్రేన్లు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, జలవిహార్, బేబీ వాటర్ పాండ్ వద్ద క్రేన్లు ఏర్పాటు చేశా రు. హుస్సేన్ సాగర్ చుట్టూ మెుత్తంగా 31 క్రేన్లు ఏర్పాటు అయ్యాయి.