Monday, April 29, 2024

కోహ్లి సేనకు ఐసిసి షాక్

- Advertisement -
- Advertisement -

Virat

దుబాయి: తొలి వన్డేలో అనూహ్య ఓటమితో డీలా పడిన టీమిండియాకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) భారీ షాక్ ఇచ్చింది. బుధవారం కివీస్‌తో జరిగిన మొదటి వన్డేలో నిర్ణీత సమయంలో భారత్ ఓవర్లను పూర్తి చేయలేక పోయింది. దీంతో ఐసిసి టీమిండియాకు భారీ జరిమానా విధించింది. జట్టు సభ్యులకు ఇచ్చే మ్యాచ్ ఫీజులో ఏకంగా 80 శాతం కోత విధించింది. ఈ సిరీస్‌లో భారత్‌కు ఇలాంటి జరిమానా విధించడం ఇది మూడో సారి కావడం గమనార్హం.

టి20 సిరీస్‌లో కూడా భారత్ రెండు మ్యాచుల్లో నిర్ణీత సమయంలో ఓవర్ల కోటాను పూర్తి చేయడంలో విఫలమైంది. అప్పట్లో కూడా మ్యాచ్ రిఫరీ టీమిండియాకు జరిమానా విధించాడు. ఒక్కో ఓవర్‌కు 20 శాతం చొప్పున మ్యాచ్ ఫీజులో కోత విధించిన విషయం తెలిసిందే. తాజాగా తొలి వన్డేలో కూడా భారత్ నిర్ణీత సమయం ముగిసినా పూర్తి ఓవర్లను వేయలేక పోయింది. అప్పటికే మరో నాలుగు ఓవర్లు మిగిలి పోయాయి. దీంతో ఒక్కో ఓవర్‌కు 20 శాతం చొప్పున ఆటగాళ్ల ఫీజులో మ్యాచ్ రిఫరీ మొత్తం 80 శాంత కోతను విధించాడు. ముందే ఓటమి బాధతో ఉన్న టీమిండియాకు జరిమానా రూపంలో మరో ఎదురు దెబ్బ తగిలింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 347 పరుగుల భారీ స్కోరు సాధించినా ఓటమి చవిచూడక తప్పలేదు.

New Zealand vs India 1st ODI 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News