Monday, October 14, 2024

వధువు ముస్తాబులో పరీక్ష హాలుకు(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: పెళ్లి ముఖ్యమా, చదువు ముఖ్యమా అన్న సంకట స్థితి ఎదురైనపుడు ఆడపిల్లలు దేనికి ప్రాధాన్యమిస్తారు&ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం చాలా కష్టం. అయితే ఉత్తర్ ప్రదేశ్‌లోని షాన్సీకి చెందిన కృష్ణ రాజ్‌పుత్ అనే యువతి మాత్రం తనకు రెండూ ముఖ్యమేనంటోంది. అందుకే పెళ్లికుమార్తెగా ముస్తాబై అదే అలంకరణలో బిఎ చివరి సంవత్సరం సోషియాలజీ పరీక్షకు హాజరైన కృష్ణ పరీక్ష రాసిన తర్వాత పెళ్లి పీటలపై కూర్చుని తాళి కట్టించుకుంది. మే 16న ఈ సంఘటన జరిగింది.
హిందూ వివాహాలు ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం జరుగుతుంటాయి.

Also Read: కమల్ హాసన్ కు అరుదైన అవార్డు

అయితే.పెళ్లి జరగాల్సిన రోజే బిఎ చివరి సంవత్సరం పరీక్ష ఉండడంతో కృష్ణ రాజ్‌పుత్‌కు సంకట స్థితి ఎదురైంది. అయినప్పటికీ ఆ యువతి పరీక్ష రాసిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని పెద్దలకు నచ్చచెప్పింది. వధువుగా తయారై పరీక్ష హాలుకు ఆమె రావడంతో తోటి విద్యార్థులతోపాటు అధ్యాపకులు సైతం ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా మీడియాతో కృష్ణ మాట్లాడుతూ తనకు పెళ్లి ఎంత ముఖ్యమో చదువు కూడా అంతే ముఖ్యమని, పరీక్ష రాసిన తర్వాత నేరుగా వెళ్లి పెళ్లి చేసుకుంటానని చెప్పింది. వధువు అలంకరణలో పరీక్ష రాస్తున్న కృష్ణ రాజ్‌పుత్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా చదువు పట్ల ఆమె అంకితభావానికి నెటిజన్లు అభినందనలు తెలియచేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News