Saturday, July 27, 2024

నిధికి బంపర్ ఆఫర్..

- Advertisement -
- Advertisement -

పవర్ ‌స్టార్ పవన్ కళ్యాణ్, జాగర్లమూడి క్రిష్ కాంబినేషన్‌లో ఓ పీరియాడికల్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు షెడ్యుల్స్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ ఏ.యం.రత్నం నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మొఘలుల కాలం నాటి ఫిక్షనల్ స్టోరీతో వస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ వజ్రాల దొంగగా కనిపిస్తాడని సమాచారం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో చార్మినార్ సెట్, హైదరాబాద్ శివార్లలో ఓ దర్బార్ సెట్ వేశారని తెలిసింది. ఇక ఈ సినిమాలో పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోందని సమాచారం.

ఇప్పటికే నిధి అగర్వాల్ కొన్ని రోజులు షూటింగ్‌లో కూడా పాల్గొందని తెలిసింది. ఏదేమైనా నిధి బంపరాఫర్ కొట్టేసిందనే చెప్పాలి. ‘సవ్యసాచి’ సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన ఈ భామ ‘ఇస్మార్ట్ శంకర్’తో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు పవర్ స్టార్‌తో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఇకపోతే ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండేజ్ మరో హీరోయిన్‌గా కనిపించనుందని వార్తలు వస్తున్నాయి.

Nidhi Agarwal got offer to opposite Pawan Kalyan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News