Tuesday, May 21, 2024

బాలయ్య, బోయపాటి మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..

- Advertisement -
- Advertisement -

#BB3 Movie to Release on May 28

హైదరాబాద్: నందమూరి నటసింహం బాలయ్య బాబు, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గతేడాది బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ‘బిబి3 ఫస్ట్ రోర్’తో ఓ వీడియోను విడుదల చేయగా.. దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కాగా, ఇప్పటివరకు ఈ మూవీకి టైటిల్ ను అనౌన్స్ చేయలేదు చిత్రయూనిట్. ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న సినిమాల విడుదల తేదీలను ఆయా చిత్రయూనిట్స్ ప్రకటిస్తున్నాయి. దీంతో బాలయ్య, బోయపాటిల మూవీ విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య అభిమానులకు చిత్రయూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమాను మే 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీకి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

#BB3 Movie to Release on May 28

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News