78వ కేన్స్ చిత్రోత్సవాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. నిహార్ పాల్వే రూపొందించిన ‘ది స్మార్ట్, ది కామ్, ది మ్యాడ్‌నెస్, మ్యాజ్‌కి’ అనే లఘు చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ ఎనిమిది చిత్రాలలో ఒకటిగా అధికారికంగా ఎంపికైంది, ఈ చిత్రం 2025 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడుతోంది. ఈ చిత్రం మే 19న(ఆదివారం) సినిమా ఒలింపియాలో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుంది, ఆ తర్వాత మే 24న లండన్‌లోని బిఎఫ్‌ఐ ఐమాక్స్‌లో దాని వరల్డ్ ప్రీమియర్ ఉంటుందని ఓ పత్రికా ప్రకటన తెలిపింది.
‘ది స్మార్ట్, ది కామ్, ది మ్యాడ్‌నెస్, మ్యాజ్‌కి’ అనే ఈ లఘు చిత్రంను 8ఎంఎం ఫిల్మ్ సింగిల్ రోల్‌పై చిత్రీకరించారు, దీనిని హర్కత్ స్టూడియోస్‌తో కలిసి నిర్మించారు. ఇందులో ప్రీత్ కమానీ, అదితి సంధ్య శర్మ నటించారు. అదిత్ ఆనందే సంగీతం అందించారు. 25 సంవత్సరాలకు పైగా పోటీలో ఒక భారతీయ సినిమా ప్రారంభం నుండి నేరుగా ఎనిమిదింటిలో టాప్ ఎనిమిదవ స్థానానికి చేరుకోవడం అనేది ఇదే మొదటిసారని సినిమా తయారీదారులు తెలిపారు. 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మే 13న ప్రారంభమైంది. మే 24వరకు కొనసాగుతుందన్నది గమనార్హం.