Thursday, April 25, 2024

జనవరి 22న నిర్భయ హంతకులకు ఉరిశిక్ష

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నిర్భయ హంతకులు నలుగురికి జనవరి 22 ఉదయం 7 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని ఢిలీ కోర్టు ఆదేశించింది. 2012 డిసెంబర్ నెలలో 23 ఏళ్ల ఫిజియోథెరపి విద్యార్థినిపై నలుగురు దుండగులు అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారం జరిపి చిత్రహింసలకు గురిచేయగా ఏడేళ్ల విచారణ అనంతరం దోషులకు ఉరిశిక్ష అమలుకు తేదీని కోర్టు ఖరారు చేసింది. తన కుమార్తె చావుకు కారకులైన నలుగురు హంతకులకు మరణ శిక్ష అమలుకు వారెంట్లు జారీచేయడంతో న్యాయవ్యవస్థ పట్ల ప్రజలలో విశ్వాసం మరింత బలపడిందని నిర్భయ తల్లి వ్యాఖ్యానించారు. కాగా, దోషులు అప్పీలుకు లేదా క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసుకునే హక్కును వినియోగించుకుంటే ఈ మరణశిక్ష అమలు వారెంట్లను నిలిపివేసే అవకాశం కూడా లేకపోలేదు. నిర్భయ కేసులో హంతకులుగా తేలిన అక్షయ్, వినయ్, పవన్, ముఖేష్‌ల తమకు చట్టపరంగా సంక్రమించే హక్కును వినియోగించుకోవడానికి కోర్టు 14 రోజుల వ్యవధి ఇచ్చింది.
Nirbhaya case convicts to hang on Jan 22: Delhi Court

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News