Sunday, April 28, 2024

139 మందిపై నిర్భయ కేసు

- Advertisement -
- Advertisement -

 5వేల సార్లు తనపై అత్యాచారం చేశారని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఓ యువతి ఫిర్యాదు
 జాబితాలో రాజకీయ నేతలు, పిఎలు, సినీ ప్రముఖులు, ఓ విద్యార్థి సంఘం నేత, రాష్ట్రంలో సంచలనం

Nirbhaya case filed against 139 people in Panjagutta PS

మనతెలంగాణ/హైదరాబాద్: ఏకంగా 139 మంది 5వేల సార్లు అత్యాచారం జరిపారని శుక్రవారం నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఓ పాతికేళ్ల యువతి 113 పేజీల లేఖతో కూడిన ఫిర్యాదు చేసింది. దీంతో పంజాగుట్ట పోలీసులు 139మందిపై నిర్భయ కేసు నమోదు చేశారు. ఈక్రమంలో ఫిర్యాదులో రాజకీయ నాయకుల పిఎలు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల పేర్లను కూడా చేర్చినట్టు పోలీసులు వివరించారు. అదేవిధంగా విద్యార్థి సంఘం నాయకులు సైతం యువతిపై అత్యాచారం చేశారని తెలియజేయడంతో వారిపైనా కేసులు నమోదు చేశారు. పంజాగుట్ట పోలీసుల కథనం ప్రకారం…నల్గొండ జిల్లా,వేములపల్లి మండలం, సెట్టిపాలెం గ్రామానికి చెందిన యువతి(25) నగరంలోని సోమాజిగూడ, రాజ్‌భవన్ రోడ్డులోని అమృతవ్యాలీ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటోంది. మిర్యాలగూడకు చెందిన కొండారెడ్డి రమేష్‌తో 2009లో ఆమెకు వివాహం జరిగింది. మూడు నెలల తర్వాత ఆడపడుచు సుజాత, మర్ధి ఉపేందర్, అత్తామామ బుచ్చయ్య, ఎల్లమ్మ కలిసి తనను మానసికంగా శారీరకంగా వేధించారని ఆరోపించారు. వారి బంధువులు కొండపల్లి శేఖర్, రామారం రవి, గిరిధర్ గోల మిగతా 20మంది లైంగికంగా వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. వీరందరు కలిసి తొమ్మిది నెలల లైంగికంగా వేధించారని పేర్కొంది. 2010లో భర్త నుంచి విడాకులు తీసుకుంది. నగరానికి వచ్చిన తర్వాత పలువురు తనపై అత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొంది.

వీడియోలు…బెదిరింపులు
బాధితురాలిపై పలువురు నిందితులు తనపై అత్యాచారం చేయడమే కాకుండా ఫొటోలు, వీడియోలు తీశారని వాటిని అడ్డుపెట్టుకుని తనను వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయింది. సిగరెట్లతో కాల్చారని, గన్‌తో చంపివేస్తామని బెదిరించారని ఆరోపించింది. మీసాల సుమన్,కిరణ్‌కుమార్, శ్రీనివాస్, సురేందర్ రెడ్డి, సతీష్, ఆంజనేయులు, బాలు, వెంకటేష్, సంతోష్ రావు,ముఖేష్, సునీల్‌గౌడ్, శేఖర్, సూర్యచౌదరి,వినోద్‌కుమార్, శ్రావణ్‌కుమార్, శ్రీనాథ్, రామ్‌దాస్ నాయక్ కలిసి తనపై అత్యాచారం చేశారని ఆరోపించింది. తన ముఖంపై యాసిడ్ పోస్తామని బెదిరించారని, కత్తులతో కూడా బెదిరించారని ఆరోపించారు. అందరూ కలిసి తనపై ఐదువేల సార్లు అత్యాచారం చేశారని తెలిపారు. తనను కులం పేరుతో దూషించారని ఆరోపించారు. తనపై అత్యాచారం చేసినట్లు చాలామందిపై ఇలాగే అత్యాచారం చేసి ఫొటోలు, వీడియోలు తీసి వేధింపులకు గురిచేస్తున్నారని, వారి వద్ద 15,000పైగా యువతుల వీడియోలు ఉన్నాయని తెలిపింది. తన ఫేస్‌బుక్, ఇమెయిల్ హ్యాక్ చేశారని ఆరోపించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే దారుణంగా చంపేస్తామని బెదిరించారని తెలిపింది. బాధితురాలు ఆరోపణలు చేస్తున్న వారిలో లాయర్లు, విద్యార్థి సంఘాల నేతలు, రాజకీయనాయకుల పిఎలు, టివి యాంకర్లు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పంజాగుట్ట పోలీసులు తెలిపారు.

ఆదుకున్న గాడ్‌పవర్ ఫౌండేషన్

నగరంలోని గాడ్‌పవర్ ఫౌండేషన్ వారు తనకు సాయం చేసినట్లు బాధితురాలు తెలిపింది. కష్టసమయంలో ఆదరించిన గాడ్‌పవర్ ఫౌండేషన్ కి బాధితురాలు ధన్యవాదాలు తెలిపింది.

Nirbhaya case filed against 139 people in Panjagutta PS

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News