Tuesday, April 30, 2024

ముంపు ముప్పులోనే…

- Advertisement -
- Advertisement -

 జలదిగ్బంధంలోనే భద్రాద్రి, వరంగల్ జిల్లాలు, రామప్పకు భారీగా వరద నీరు 
 చుట్టుపక్కల 20గ్రామాలకు పొంచి వున్న ప్రమాదం, వరంగల్, ఖమ్మం జాతీయరహదారిపై నిలిచిన రాకపోకలు
 భద్రాద్రిలో కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక

మన తెలంగాణ/హైదరాబాద్: ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు కారణంగా భద్రాద్రి, ఓరుగల్లులు జలదిగ్భంధంలోనే ఉన్నాయి. వరంగల్ గ్రామీణ జిల్లాలో భారీ వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. రామప్ప సరస్సుకు భారీగా నీరు చేరడంతో 3 ఫీట్ల ఎత్తులో మత్తడి పోస్తోంది. ఫలితంగా పొలంపేట రోడ్డు నీట మునగడం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మేడివాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో ములుగు, ఏటూరు నాగారం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రామప్ప చెరువుకు వరద నీరు పోటెత్తడంతో నీటిమట్టం నలభై అడుగులకు పైగా చేరింది. రామప్ప నీటి సామర్థం 2.91 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 4.27 టీఎంసీల నీటి మట్టం ఉందని, వరద మరింత పెరిగే ప్రమాదం ఉన్న కారణంతో 20 గ్రామాలకు ప్రమాదం పొంచి ఉందని అధికారులు అంటున్నారు. దీంతో ఇరవై గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాల ధాటికి వర్దన్నపేట కోనారెడ్డి చెరవుకట్టతెగి వరంగల్‌ఖమ్మం జాతీయ రహదారిపైకి వరదనీరు చేరింది. వరద ఉద్ధృతికి జాతీయ రహదారి కోతకు గురైంది. ఫలితంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.

మరోవైపు చెన్నారావుపేట మండలంలో నెక్కొండనర్సంపేట ప్రధాన రహదారిపై లోలెవెల్ వంతెన వద్ద నీటి ప్రవాహంలో లారీ చిక్కుకుపోయింది. 12 గంటలు గడవక ముందే వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం ప్పరపల్లి ఊర చెరువుకు గండి పడింది. విషయం తెలుసుకున్న పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హుటాహుటిన ఉప్పరపల్లికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల అధికారులను ఆదేశించారు. ములుగు జిల్లాలో పదిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. ములుగు మండలం జంగాలపల్లి సమీపంలో మేడివాగు వరద ఉద్ధృతి తీవ్రంగానే కొనసాగుతోంది. ప్రధాన రహదారి కిలోమీటరు మేర మునిగిపోయింది. పరిస్థితిని సమీక్షించిన అధికారులు వరంగల్ నుంచి ఛత్తీస్‌గడ్ వైపు వెళ్లే జాతీయరహదారిపై రాకపోకలు నిలిపివేశారు. గురువారం చేపలవేటకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు మేడి వాగు ఉద్ధృతిలో గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం సహాయక సిబ్బంది గాలిస్తున్నారు.
భద్రాద్రిలో కొనసాగుతున్న మూడో ప్రమాద హచ్చరిక
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. నీటిమటటం 53 అడుగులకు చేరడం వల్ల అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు గోదావరి నీటిమట్టం 54.8 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. గోదారవి ఉద్ధృతి పెరగడం వల్ల భద్రాచలంలోని రామాలయం ప్రాంతంలోని కొత్త కాలనీ, ఎంసీ కాలనీల్లో వరదనీళ్లు చేరాయి. భద్రాచలం నంపచి ఏజెన్సీ మండలాలైన దమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం తదితర మండలాలకు రాకపోకలు స్తంభించాయి.

Heavy floods to Warangal due to Rains

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News