Saturday, April 20, 2024

నిర్భయ దోషుల క్యూరేటీవ్ పిటిషన్ కొట్టివేసిన సుప్రీం..

- Advertisement -
- Advertisement -

Supreme Court

 

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసు దోషులకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. నిర్భయపై సామూహిక అత్యాచారం చేసి, చంపిన నేరస్థులు ముకేష్(32), పవన్ గుప్తా(25), వినయ్ శర్మ(26), అక్షయ్‌కుమార్ సింగ్(31)లను జనవరి 22 ఉదయం 7 గంటలకు తీహార్ జైల్లో ఉరితీయాలని ఢిల్లీ పాటియాల కోర్టు ఆదేశించింది. దీంతో నిర్భయ దోషుల్లో ఇద్దరు వినయ్ శర్మ, ముఖేష్ సింగ్ లు ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని చివరి ప్రయత్నంగా క్యూరేటివ్ పిటిషన్‌ ద్వారా సుప్రీంని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఐదుగురు సభ్యులు.. ఎన్వీ రమణ, అరుణ్ మిశ్ర, ఆర్ఎఫ్ నారిమన్, ఆర్ భానుమతి, అశోక్ భూషన్ తో కూడిన బెంచ్ వీరి పిటిషన్‌ను విచారించింది. ఈ క్యూరేటివ్ పిటిషన్‌ విచారణకు వీరు అర్హులు కారని ధర్మాసనం పిటిషన్‌‌ను కొట్టివేసింది.దీంతో నిర్భయ దోషులకు తీహార్ జైల్లో ఉరిశిక్ష అమలు చేయనున్నారు. ఇప్పటికే జైలు అధికారులు ఉరికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు.

Nirbhaya Rape Case: SC Dismisses Curative Petitions

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News