Sunday, May 5, 2024

రూపాయిలో 15 పైసలు మాత్రమే ప్రజలకు చేరుతున్నాయి: నిర్మలా సీతారామన్

- Advertisement -
- Advertisement -

 

ఢిల్లీ: ప్రప్రంచంలో ఇప్పుడు భారత్‌ది ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కేంద్ర బడ్జెట్ 2020-2021ను లోక్ సభలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇది సామాన్యుల బడ్జెట్ అని, ప్రజల ఆదాయం పెంచే దిశగా బడ్జెట్ ఉందన్నారు. 15వ ఆర్థిక సంఘం రిపోర్ట్‌ను నిర్మలా ప్రవేశపెట్టారు. భారత ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీకి తిరుగులేని తీర్పు ఇచ్చారని, రాజకీయ స్థిరత్వంతో పాటు ఆర్థిక పురోగతి ఆశిస్తూ అధికారిమిచ్చారని, అన్ని వర్గాల కొనుగోలు శక్తికి ఊతమిచ్చేలా బడ్జెట్ ఉంటుందని, అన్ని రంగాల్లో వృద్ధిరేటు పెరిగితేనే వ్యవస్థ చక్కబడుతుందని, ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టామని, తాము అధికారంలోకి వచ్చాక ఆర్థిక సంస్కరణలు వేగవంతం చేశామని వివరించారు.

ఆర్థిక రంగ మూలాలు బలంగా ఉన్నాయని, ఆర్థిక సంస్కరణల్లో జిఎస్‌టి చాలా కీలకమైనదని, జిఎస్‌టి విషయంలో దివంగత మాజీ ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ముందు చూపుతో వ్యవహరించారని, పాలనారంగంలో పూర్తిస్థాయి మార్పులు తీసుకొచ్చామన్నారు. జిఎస్‌టి వల్ల ప్రతి కుటుంబానికి నాలుగు శాతం ఆదా అయిందని, కేంద్రం ప్రభుత్వం రుణాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని ఆర్థిక శాఖ మంత్రి తెలిపారు. ఇన్‌స్పెక్టర్ రాజ్‌కు చరమగీతం పాడామని, దీనివల్ల చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు లాభం జరిగిందన్నారు. 16 లక్షల మంది కొత్త పన్ను చెల్లింపుదారులు చేరారని, రిటర్స్‌లలో సమూల మార్పులు తీసుకొచ్చామని, 40 కోట్ల మంది పన్ను రిటర్నులు ఫైల్ చేశారని, సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ ద్వారా పథకాలు వేగంగా ప్రజలకు చేరుతున్నాయన్నారు.

సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకు చేరడం లేదని, రూపాయిలో 15 పైసలు మాత్రమే ప్రజలకు చేరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈజ్ ఆఫ్ లివింగ్ ప్రతి పౌరుడికి చేరేలా చూస్తామని, 2014-19 మధ్య ఎఫ్‌డిఐలు 119 బిలియన్ డాలర్ల నుంచి 284 డాలర్లకు పెరిగాయన్నారు. 2014-19 మధ్య 704 శాతం వృద్ధి రేలు సాధించామని, ఈ బడ్జెట్‌లో మూడు అంశాలపై దృష్టి పెట్టామని, ఉన్నత జీవన ప్రమాణాలు, ఆర్థికాభివృద్ధి సామాజిక భద్రతే ఈ బడ్జెట్ లక్ష్యాలు అని, ఆయుష్మాన్ భవ అద్భుత ఫలితాలనిచ్చిందని ఆర్థిక శాఖ మంత్రి ప్రశంసించారు. జిడిపిలో ఇప్పుడు 48.7 శాతానికి అప్పులు తగ్గాయన్నారు.

 

Budget is to boost the income of people and enhance their purchasing power

 

Nirmala Sitharaman presents Union Budget 2020-2021
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News