Sunday, May 5, 2024

2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు: ఆర్థిక శాఖ మంత్రి

- Advertisement -
- Advertisement -

 

ఢిల్లీ: రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్షమని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వ్యవసాయ ఆదాయం పెరుగుతోందన్నారు.  లోక్ సభలో బడ్జెట్ 2020-2021ను ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెడుతున్నారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ మార్కెటింగ్ విధానం సరళతరం చేస్తామని, వ్యవసాయాభివృద్ధికి 16 సూత్రాల కార్యక్రమం ఏర్పాటు చేస్తామని, వ్యవసాయానికి సంబంధించి మూడు కొత్త చట్టాలు తెస్తామని, నీటి ఎద్దటి ఉన్న 100 జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని ప్రకటించారు. 20 లక్షల మంది రైతులకు సోలార్ పంపులు ఇస్తామని, బీడు భూముల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు.

వేర్ హౌసెస్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుందని, గ్రామీణ స్టోరేజ్ స్కీమ్ పేరుతో కొత్త పథకం ఉంటుందని, స్వయం సహాయక గ్రూపులకు ధాన్య లక్ష్మి రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆర్గానిక్ ఫార్మింగ్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, ఆర్గానిక్ ఫార్మింగ్ మార్కెట్‌కు జాతీయ స్థాయిలో స్కీమ్ ఏర్పాటు చేశామని, రైళ్ల ద్వారా పంటల రవాణాకు కిసాన్ రైల్ సౌకర్యం, మరింత్ విస్తృతంగా నాబార్ట్ రీ ఫైనాన్స్ స్కీమ్ ఏర్పాటు చేశామని వివరించారు. కిసాన్ క్రెడిట్ స్కీమ్ కోసం రూ.15 లక్షల కోట్లు ఖర్చు చేశామని, 2021 కల్లా 108 మిలియన్ మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 2022-23 నాటికి మత్స ఉత్పత్తి 200 లక్షల టన్నుల లక్ష్యంగా పని చేస్తామని, మత్స్య ఉత్పత్తి రంగంలో గ్రామీణ యువతకు ప్రోత్సాహకాలు ఇస్తామని, వ్యవసాయం, నీటి పారుదల, గ్రామీణాభివృద్ధి రంగాలకు కలిపి రూ.2.83 లక్షల కోట్లు కేటాయిస్తామన్నారు. ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌లో ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ వినియోగిస్తామన్నారు.

 

Nirmala Sitharaman says Budget 2020-21 about Farmer
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News