Thursday, April 25, 2024

వృద్ధిలో ఉన్నతం పనితీరులో ప్రథమం

- Advertisement -
- Advertisement -

NITI AAYog

 

పలు రంగాల్లో రాష్ట్రానికి
నీతి అయోగ్ విశిష్ట గుర్తింపులు

67 శాతం మార్కులతో ఫ్రంట్ రన్నర్ రాష్ట్రాల జాబితాలో తెలంగాణ
సుస్థిర అభివృద్ధి లక్షాల సాధనలో మూడోస్థానం, పేదరిక నిర్మూలనలో 52, ఆరోగ్య శ్రేయస్సులో 66, నాణ్యమైన విద్యలో 64, మంచి నీరు పరిశుభ్రతలో 84, శుద్ధ ఇంధన శక్తిలో 93 మార్కులు

హైదరాబాద్ : రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రగతిని ప్రతిబింబించే సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్) ఆధార నీతి ఆయోగ్ నివేదిక -2019 మంచి పనితీరు, ఆర్థిక వృద్ధిలో తెలంగాణ రాష్ట్రం తొలి ర్యాంకును సాధించింది. మొత్తం 82 మార్కులతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తరువాత 78 మార్కులతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. ఇక సుస్థిర అభివృద్ధి లక్ష్యాల పూర్తిస్థాయి నివేదికలో తెలంగాణ ఫ్రంట్ రన్నర్‌లో భాగంగా 67 మార్కులతో తెలంగాణ మూడో ర్యాంకును సాధించింది. రాష్ట్రంతో పాటు తమిళనాడు, ఎపి కూడా మూడోస్థానంలో నిలిచాయి. గతేడాది ఆరో స్థానంలో తెలంగాణ ఉండగా, పని తీరును మెరుగుపరచుకొని మూడు స్థానాలు ఎగబాకింది. కాగా, నీతి ఆయోగ్ ప్రకటించిన జాబితాలో మొదటి ఐదు స్థానాల్లో దక్షిణాది రాష్ట్రాలే ఉన్నాయి.

2030 నాటికి సాధించాలనుకున్న స్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో దేశంలోని రాష్ట్రాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇది సూచిస్తోంది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ, గ్లోబల్ గ్రీన్ గ్రోత్ ఇన్‌స్టిట్యూట్, ఐక్యరాజ్యసమితి భారతీయ విభాగాల సహకారంతో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పేదరికం, ఆర్థిక వృద్ధి, ఆరోగ్యం వంటి 17 అంశాలపై నీతి ఆయోగ్ నివేదికను విడుదల చేస్తోంది.౦నీతి ఆయోగ్ తాజా ఎస్‌డిసి నివేదికలో 0 నుంచి 49 నడుమ మార్కులు సాధించిన రాష్ట్రాలను ఆకాంక్షిత రాష్ట్రాలుగా, 50 నుంచి 64 మధ్య మార్కులు పొందిన వాటిని ప్రతిభావంత రాష్ట్రాలుగా, 65 నుంచి 99 మార్కులు సాధించిన వాటిని ఫ్రంట్ రన్నర్‌గా, 100 మార్కులు చేరుకున్న వాటిని లక్ష్య సాధకులుగా పేర్కొన్నారు. ఇందులో మొత్తంగా తెలంగాణ 67 మార్కులతో ఫ్రంట్ రన్నర్ రాష్ట్రాల జాబితాలో నిలిచింది.

తెలంగాణ మొదటి లక్ష సాధన అయిన పేదరిక నిర్మూలనలో 52 మార్కులు, జిరో హంగర్‌లో 36 మార్కులు, మంచి ఆరోగ్య, శ్రేయస్సులో 66 మార్కులు, నాణ్యమైన విద్యలో మార్కులు 64, జెండర్ ఈక్వాలిటీలో 26, మంచినీరు, పరిశుభ్రతలో 84 మార్కులు, సమర్థవంత, శుద్ద ఇంధన శక్తిలో 93 మార్కులు, పరిశ్రమల్లో , ఆవిష్కరణలు, మౌళిక సదుపాయాలలో 82 మార్కులు, అసమానత్వం తగ్గుదలలో 61 మార్కులు, సుస్థిర పట్టణాలు, కమ్యూనిటీలలో 94 మార్కులు, స్ధిర వినియోగం, ఉత్పత్తిలో 62 మార్కులు, వాతావరణ యాక్షన్‌లో 58 మార్కులు, నీటి ఆధారిత జీవితంలో 66 మార్కులు, లైఫ్ ఆన్ ల్యాండ్‌లో 88 మార్కులు , శాంతి, న్యాయ,బలమైన సంస్థల్లో 77 మార్కులు వచ్చాయి.

NITI AAYog Distinguished Identities for State
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News