Saturday, July 27, 2024

జంటగా జమిలిగా అభివృద్ధి.. సంక్షేమం

- Advertisement -
- Advertisement -

Municipal Elections

 

సిరిసిల్ల పట్టణ ముఖచిత్రం మార్చాం, మళ్లీ దీవించండి
39 వార్డుల్లోనూ కారు హోరెత్తాలి
ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు కావాలి, సిరిసిల్ల మున్సిపాలిటీలోని పార్టీ బూత్‌కమిటీ నాయకులతో భేటీలో మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/సిరిసిల్ల : “ సిరిసిల్ల పట్టణ మార్పుకోసం మాటిచ్చి నిలుపుకున్నాం. అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల్లా నడిపిస్తున్నాం. సిరిసిల్ల పట్టణ ముఖచిత్రం మార్చాం. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థులను మరోసారి దీవించాలి” అని ఐటి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రజలను కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సోమవారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని బూత్ కమిటీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కెటిఆర్ మాట్లాడారు. సిరిసిల్లలో తెరాస టికెట్ ఆశిం చే వారి సంఖ్య అధికంగా ఉందని, అయితే ఒక్కరికే టికెట్ ఇ వ్వక తప్పదన్నారు. పార్టీ కోసం పనిచేసేవారికి గు ర్తింపు ఉంటుందన్నారు. సిరిసిల్లలోని 39 వార్డుల్లో కారు గుర్తు గెలవాలని, ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు కావాలని మంత్రి సూచించారు.

మున్సిపల్ పై తెరాస జెండా ఎగిరేసే అవకాశం మరోసారి ఇస్తే సిరిసిల్లలో రెండింతల అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. కన్నీళ్లతో తల్లడిల్లిన సిరిసిల్లకు గోదావరి నీటిని తెచ్చామని, ఉరిసిల్లగా మారిన సిరిసిల్లను చేనేతల సిరిసిల్లగా మార్చామని వివరించారు. తమది చేతల ప్రభుత్వమని నిరూపించుకున్నామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆత్మగౌరవంతో, పూర్తి స్థాయి ధైర్యంతో ఓటు అడుగుతున్నామన్నారు. వార్డుల వారీగా లోకల్ మ్యానిఫెస్టోను ప్రకటిస్తామన్నారు. నీతి, నిజాయితీ, నిబద్దతతో కూడిన అవినీతి రహిత పాలన అందిస్తామన్నారు. సాధారణంగా ప్రభుత్వాలు స్థానిక సంస్థల ఎన్నికలంటేనే ముఖం చాటేస్తాయని, కానీ తెలంగాణ రాష్ట్రంలో సకాలంలో అన్ని ఎన్నికలను నిర్వహించామన్నారు. రాష్ట్రంలోని 12,751 గ్రామ పంచాయతీల్లో 90 శాతం, 32 జిల్లా పరిషత్‌ల ఎన్నికల్లో వంద శాతం తెరాసనే గెలుచుకుందని మంత్రి కెటిఆర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా అఖండ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

అయితే కార్యకర్తలు ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలని, అతి విశ్వాసంతో పోవద్దన్నారు. అభ్యర్థులు ప్రతి ఓటరును కనీసం ఐదుసార్లు కలిసి చేసిన అభివృద్ధిని వివరించాలని మంత్రి సూచించారు. సిరిసిల్ల ప్రజల కళ్ల ముందుకే గోదావరి జలాలను తరలించిన ఘనత సిఎం కెసిఆర్‌దే అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మూడేళ్లలో రికార్డు స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి గోదావరి జలాలను సూర్యాపేట, కోదాడ వరకు తరలించారన్నారు. మీ ఆశీర్వాదంతోనే గత ఎన్నికల్లో 90వేల ఓట్ల ఆధిక్యంతో ఎమ్మెల్యే అయ్యాయని, మంత్రిగా మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాని పేర్కొన్నారు. తాను రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేయాల్సి ఉన్నందున సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల కోసం ఐదుగురు సభ్యులతో కూడిన కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేస్తానని, వారితో తాను కాంటాక్ట్‌లో ఉంటానన్నారు.

కమిటీ చెప్పిన మాటే తన మాటగా గుర్తుంచుకోవాలని కార్యకర్తలకు మంత్రి కెటిఆర్ సూచించారు. ప్రజలు మన పక్షాన ఉన్నారని ప్రచారం చేయడం మరచిపోవద్దన్నారు. సిరిసిల్ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, మానేరు నదిపై రైల్ కమ్ రోడ్ వంతెన నిర్మాణం, త్వరలోనే రైలును సిరిసిల్లకు తీసుకు రావడం, అపెరల్ పార్క్ పూర్తి చేసి దాదాపు 12 వేల మంది మహిళలకు ఉపాధి కల్పించడం, నర్సింగ్ కళాశాల, వ్యవసాయ కళాశాల తెచ్చానని మరిన్ని కళాశాలలు తేవడంతో పాటుగా మానేరు కరకట్టను మరింత అభివృద్ధి పరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కొత్తచెరువు, కార్గిల్ లేక్‌ను అభివృద్ధి పరిచి, 20 నుంచి 25 ఎకరాల స్థలంలో మంచి పార్క్‌ను ఏర్పాటు చేస్తానన్నారు. కొత్త మున్సిపల్ చట్టంపై అవగాహన పెంచుకుని అభ్యర్థులు పోటీ చేయాలన్నారు. ప్రజలకు సేవ చేయని వారు పదవులు కోల్పోతారని, గతంలో మాదిరిగా కాకుండా సేవాభావం పెంచుకోవాలన్నారు. పుర పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నామన్నారు.

సిరిసిల్లలో దాదాపు 2 వేల డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించామని, త్వరలో వాటిని డ్రా పద్ధతిన అర్హులకు అందజేస్తామని మంత్రి కెటిఆర్ తెలిపారు. అర్హులు ఉంటే మరిన్ని ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సమావేశంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, సెస్ చైర్మన్ డి లకా్ష్మరెడ్డి, రైతు సమన్యయ సంస్థ అధ్యక్షులు గడ్డం నర్సయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ సామల పావని పాల్గొన్నారు.

TRS candidates need to win in Municipal Elections
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News