Sunday, June 23, 2024

కరువుపై జలఖడ్గం

- Advertisement -
- Advertisement -

Drought

 

రాష్ట్రాన్ని చూసి దుర్భిక్షం భయపడాలి

ఇక నుంచి రెండు పంటలు
కోటి 25లక్షల ఎకరాలకు నీరందించే ప్రాజెక్టులను నిర్మిస్తున్నాం
ఆనాడు 1000 అడుగులు బోరు వేసినా నీరురాక జమ్మికుంట భిక్షపతి ఆత్మహత్య చేసుకున్నాడు

ఆత్మహత్యలు పరిష్కారం కాదని కలెక్టర్లు గోడల మీద రాయించేవారు
ఈ ప్రాంతంలో పుష్కలంగా జలవనరులు, 46 వాగులు, చెరువులున్నాయి
అయినా ఈ దుస్థితి ఏమిటని బాధపడ్డాను, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు
ప్రాజెక్టులు పూర్తి అవుతున్నాయి, భూగర్భజలాలు ఉబికి వస్తున్నాయి
మిడ్ మానేరు ద్వారా 70-80% నీరు అందుతుంది : సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో శాత్వతంగా కరువును తరిమివేయడానికి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చ ంద్రశేఖర్ రావు చెప్పారు. రాష్ట్రంలోకి కరువు రావడానికి భయపడాలన్నారు. సాగునీటి పారుదల ప్రాజెక్టుల ద్వారా కోటి 25 లక్షల ఎకరాల కు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్మిస్తోందన్నారు. సోమవారం మిడ్‌మానేరు ప్రాజెక్టులో గోదావరికి జల హారతి ఇ చ్చిన అనంతరం తీగల గుట్టలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో కరువును శాత్వతంగా తరిమివేసేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. తెలంగాణ సాధించుకుంటే గోదావరి డెల్టా భూముల్లో రెండు పంటలు పండించి సశ్యశామలం చేయవచ్చునని ఆనాడు ఉద్యమ సమయంలో చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాళేశ్వరం నిర్మాణంలో గోదావరి డెల్టా ప్రాతం భూముల్లో పసిడి పంటలు పండుతాయని ఆనాడు చెప్పన మాట లు నేడు సాకారం అవుతుంటే హృదయం ఆనం ద పడుతుందన్నారు.

కరీంనగర్‌లో జలవనరులు పుష్కలంగా ఉండికూడా గతంలో కరువు తాండవించిందని గుర్తు చేశారు. గత పాలనలో ఇక్కడి నుంచి బతుకు తెరువుకోసం దుబాయ్‌కు వలసలు వెళ్లారు. ఇతర ప్రాతంతాల్లో కూలీకి వెళ్లారన్నారు. సిరిసిల్ల, వేములవాడలోని పలు ప్రాంతాలు ఆనాడు కరువునపడ్డాయి. సుమారు వెయ్యి అడుగుల లోతు బోరువేసినా నీరు వచ్చే పరిస్థితి లేకుండే. తెలంగాణ రాకముందు జమ్మికుంటలో కరువు కోరల్లో బిక్షపతి ఆత్మహత్యచేసుకున్నాడు. సిరిసిల్లలో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యలు పరిష్కారం కావని ఆనాడు కలెక్టర్లు గోడల మీద రాసేవారు. ఆనాటి పరిస్థితిని చూసి నాకు కళ్లనిండా నీళ్లువచ్చేవి, ఈ పరిస్థితిమారాలని కోరుకున్నాను, పుష్కలమైన జలవనరులు, 46 వాగులు, చెరువులు ఉన్న ఈ ప్రాంతాల్లో కరువు ఎందుకు ఉందని బాధపడ్డాను. ఇప్పుడు ఆపరిస్థితి లేదు. ప్రాజెక్టులు పూర్తి అవుతున్నాయి. భూగర్భజలాలు పైకి ఉబికి వస్తున్నాయన్నారు. మిడ్‌మానేరు ద్వారా 70 నుంచి 80 శాతం నీరు తెలంగాణ ప్రాంతానికి అందుతుందని తెలిపారు.

మిడ్‌మానేరు చూస్తున్నప్పుడు ఆనందం కలిగింది
ఒకప్పటి కరువు నుంచి పుష్కలమైన జల వనరులను సాధించుకున్నామనే తృప్తినిచ్చింది. జీవితానికి సాఫల్యం లభించిందని గోదావరి తల్లికి హారతి ఇస్తున్నప్పుడు అనిపించింది. లక్ష్మీ,సరస్వతీ, పార్వతీ బ్యారేజీల్లో 145 కిలోమీటర్ల పరిధిలో గోదావరి జలాలు 365 రోజులు పరవళ్లు తొక్కుతాయన్నారు.రాజరాజేశ్వరస్వామి కొలువై ఉన్న ప్రాంతంలో మిడ్‌మానేరు ఉండటంతోనే స్వామివారి పేరును ఈ ప్రాజెక్టు పెట్టినట్లు చెప్పారు. ధవళేశ్వరం ప్రాజెక్టుకు ఇబ్బంది కలుగుతుందని నాడు మిడ్‌మానేరు మూల వాగుపైన నిమ్మపల్లి ప్రాజెక్టును సమైక్యపాలకులుఉద్దేశపూర్వకంగా నిలిపివేశారని సిఎం కెసిఆర్ చెప్పారు. ఆ రోజుల్లో ముల్కి పాయె.. మూటపాయె..మూలవాగు నీళ్లు పాయె అంటూ తెలంగాణ ప్రజలు పాటలు పాడుకునే వారని ఎప్పారు.

గత స్మృతులను గుర్తు తెచ్చుకున్న సిఎం
ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ పర్యటనలో అనేక పర్యాలు గత స్మృతులను నెమరు వేసుకున్నారు. రాజ రాజేశ్వర స్మామి దేవాలయానికి తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దేవాలయం కలియ తిరిగి సంప్రదాయం మేరకు మొక్కులు చెల్లించి కోడెలను సమర్పించారు. వేముల వాడ రాజన్న దేవాలయాన్ని గొప్పగా తీర్చి దిద్దుతామని చెప్పారు. 35 ఎకరాల్లో దేవాలయ ప్రాంగణమంతా అన్నిహంగులతో, సకల సౌకర్యాలతో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. త్వరలో శృంగేరి పీఠాధిపతిని కలిసి వేములవాడ రాజన్న ఆలయాన్ని తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. 202021 బడ్జెట్‌లో వేములవాడ అభివృద్ధికి నిధులను కేటాయించనున్నట్లు ప్రకటించారు. కాకతీయ కాలువ పాత కాలువ కరీంనగర్ జిల్లాలో 200 మీటర్లు పారుతుందని తెలిపారు. 181 కిలో మీటర్లు పొడవున్న మానేరు సజీవంగా ఉందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 1230 చెక్‌డ్యాంలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందని వాటిలో సింహ భాగం కరీంనగర్ జిల్లాలోనే ఉన్నాయని, రూ.1250 కోట్ల వ్యయంతో ఈ డ్యామ్‌లు రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాల అధికారులను ఆదేశించారు. మానేరు రివర్‌పై 29 చెక్‌డ్యాంలు, మూలవాగుపై 10 చెక్‌డ్యాంలు నిర్మించేందుకు టెండర్లు సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో సుమారు 27 లక్షల బోరు పంపులతో వ్యవసాయం చేసే విధానాన్ని ప్రాజెక్టుల నిర్మాణాలతో రైతులు మర్చిపోతున్నారన్నారు. సుమారు రూ. 440 కోట్లతో మానేరు చెక్ డ్యాంలు, రూ.40 కోట్లతో మూలవాగు చెక్ డ్యాంలు పూర్తి చేసి జూన్‌లోగా నీటితో నింపుకోవాల్సి ఉందన్నారు. లండన్ లోని థేమ్స్ నది ఎలాగైతే సజీవంగా ఉంటుందో మానేరు నదికూడా అలాగే ఉంటుందనే ఆనందాన్ని వ్యక్తం చేశారు.

కాంగ్రెస్, బిజెపికి అవగాహన లేదు
స్థానిక సమస్యలు, అభివృద్ధిపై అవగాహన లేకుండా కాంగ్రెస్, బిజెపి వ్యవహరిస్తోందని సిఎం కెసిఆర్ తీ వ్రంగా విమర్శించారు. భౌగోళిక పరిస్థితుల మీద కూడా ఈ రెండు పార్టీలకు అవగాహన లేదన్నారు. ఇప్పటికీ కొన్ని ప్రాజెక్టులపై కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వాటికి విపక్షాలే కారణమన్నారు. 2001 కరీంనగర్ సిం హగర్జన సభ నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ఆత్మ గౌ రవ బావుటాను టిఆర్‌ఎస్ ఎగురవేస్తోందన్నారు. ప్రాజెక్టులు కట్టాలని మాకు ఎవరూచెప్పలేదు, బాధ్యతా యు తంగా తెలంగాణను సశ్యశ్యామలం చేసేందుకు ప్రభు త్వం ప్రాజెక్టులు కడుతుందని ఆయన వివరించారు.

 

Drought should be eradicated in state
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News