Friday, September 19, 2025

సముద్రంలో మునిగి నిజామాబాద్ వాసి మృతి..

- Advertisement -
- Advertisement -

మైపాడు: నెల్లూరులో సముద్రంలో మునిగి నిజామాబాద్ వాసితో పాటు మరో వ్యక్తి మృతిచెందాడు. నిజామాబాద్ కు చెందిన కుటుంబం నెల్లూరు మైపాడు బీచ్ కు వెళ్లింది. సముద్రంలో స్నానానికి దిగిన నిజామాబాద్ వాసి సన్నీ గల్లంతయ్యాడు. సన్నీని కాపాడేందుకు ప్రయత్నించిన చిల్లకూరు వాసి సముద్రంలోకి దిగాడు. ఈ క్రమంలో అతను కూడా గల్లంతయ్యాడు సముద్రంలో కొట్టుకుపోతున్న సన్నీని గమనించిన స్థానికులు కాపాడి బయటకు తీసుకొచ్చారు.

అప్పటికే అతను స్పృహ కోల్పోయాడు. దీంతో తక్షణమే సమీప ఆస్పత్రికి తరలించారు. చికిత్ప పొందుతూ సన్నీ ప్రాణాలు కోల్పోయాడు. సన్నీని రక్షించేందుకు వెళ్లిన ఎపిలోని చిల్లకూరు యువకుడు కూడా మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News