Tuesday, August 5, 2025

బెంగాలీ భాషతో ఎవరూ ఆడుకోవద్దు: దీదీ

- Advertisement -
- Advertisement -

కామర్పుకుర్(పశ్చిమ బెంగాల్): ‘ఎవరూ మా బెంగాలీ భాషతో ఆడుకోకూడదు, అవమానించకూడదు. బంగ్లా(బెంగాల్) లేకుండా భారత్ ఉంటుందా?’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం అన్నారు. ‘బెంగాలీ సాహితీవేత్తలు రబీంద్రనాథ్ టాగోర్ జాతీయ గీతాన్ని రాశారు. బంకీమ్ చంద్ర ఛటోపాధ్యాయ జాతీయ గేయాన్ని రాశారు’ అని పేర్కొన్నారు. రామకృష్ణ పరమహంస అన్ని మతాలవారు, అందరూ సామరస్యంతో బతకాలని బోధించారన్నారు. హుగ్లీ జిల్లాలోని కమర్పుకూర్‌లో రామకృష్ణ మఠం, మిషన్ అతిథి గృహానికి శంకుస్థాపన చేసిన తర్వాత మమతా బెనర్జీ మాట్లాడుతూ ‘నేను రామకృష్ణ పరమహంస బోధనలను నమ్ముతాను. అన్ని మతాలవారు సామరస్యంతో ఉండాలని ఆయన బోధించారు. మన మధ్య చీలికలు లేవు. ప్రతి ఒక్కరూ కలిసి బతకాలనే రామకృష్ణ పరమహంస బోధించారు. స్వామి వివేకానంద కూడా ‘ఐక్యమత్యమే బలం’ అన్నారు.

వివేకానంద, సుభాష్‌చంద్ర బోస్, రాజా రామ్మోహన్ రాయ్ వంటి వారిదందరి భాష బెంగాలీయే అని పేర్కొన్నారు. ‘ప్రజలు నీటిని వారి భాషల్లో వేరువేరు రీతుల్లో పిలుస్తారు. అలాగే అమ్మను కూడా ఆయా భాషల్లో వేరువేరుగానే పిలుస్తారు, అయినప్పటికీ అమ్మ అమ్మే’ అన్నారు. కామర్పుకూర్ రామకృష్ణ మఠం కార్యదర్శి స్వామి లోకోత్తరానంద చైర్మన్‌గా జైరంబాటి కామర్పుకూర్ అభివృద్ధి బోర్డు ఏర్పాటును కూడా మమతా బెనర్జీ ఈ సందర్భంగా ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News