Saturday, July 27, 2024

ఒలింపిక్ పతక విజేత బల్బీర్ సింగ్ మృతి

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: భారత మాజీ హాకీ ఆటగాడు బల్బీర్‌సింగ్ కుల్లర్ (77)గుండెపోటుతో మృతి చెందారు. పంజాబ్‌లోని సన్సార్ గ్రామంలో తన స్వగృహంలో శుక్రవారం మధ్యాహ్నం బల్బీర్ సింగ్ మృతి చెందినట్లు ఆయన కుమారుడు కమల్‌బీర్ సింగ్ చెప్పారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. బల్బీర్ ఫార్వర్డ్‌గా భారత్‌కు ఎన్నో విజయాలు అందించారు. 1963లో అరంగేట్రం చేసిన ఆయన బెల్జియం, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పశ్చిమ జర్మనీ పర్యటనలకు వెళ్లారు. 1996లో బ్యాంకాక్ వేదికగా జరిగిన ఆసియా గేమ్స్‌లో బంగారు పతకం సాధించిన జట్టు సభ్యుడిగా ఉన్నారు. అంతేకాక 1968 మెక్సికో ఒటింపిక్స్‌లో భారత్ కాంస్య పతకం సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 2009లో పద్మశ్రీ, 1999లో అర్జున అవార్డులు అందుకున్నారు. బల్బీర్ మృతిపట్ల హాకీ సమాఖ్య సంతాపం ప్రకటించింది. ‘బల్బీర్ మృతివార్త విని ఎంతో బాధపడ్డాం. ఆయన బంధువులు, ఆత్మీయులకు హాకీ ఇండియా తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం’ అని ట్వీట్ చేసింది. ఆయన అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నారు.

Olympic hockey medalist Balbir Singh Passed Away

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News