Saturday, May 11, 2024

వచ్చే ఏడాది వరకు బిజీ బిజీగా

- Advertisement -
- Advertisement -

స్టార్ డైరెక్టర్ రాజమౌళి పాన్ ఇండియా మూవీ కోసం రెండేళ్లు వెండి తెరకు దూరమైన ఎన్టీఆర్ ఆ గ్యాప్‌ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. అందుకే మల్టీస్టారర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ పూర్తి కాకుండానే త్రివిక్రమ్‌తో మూవీ ఫైనల్ చేశారు. ఎన్టీఆర్ 30వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న త్రివిక్రమ్ మే నుండి ఈ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టనున్నారు. దీంతో ఎన్టీఆర్ అటు ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా షూటింగ్, డబ్బింగ్ కార్యక్రమాలలో పాల్గొంటూనే త్రివిక్రమ్ షూటింగ్‌లో కూడా పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఎన్టీఆర్ కి వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ వరకు విరామం ఉండదు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ నిజానికి ఈ ఏడాది జూలై 30న విడుదల కావాల్సి ఉండగా వచ్చే ఏడాది జనవరి 8కి వాయిదావేశారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర చేస్తుండగా మరో హీరో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నారు. ఇక త్రివిక్రమ్ ప్రస్తుతం ఎన్టీఆర్ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్నారు.

NTR, Trivikram Upcoming movie starts from May

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News