Sunday, April 28, 2024

మెక్సికో టెన్నిస్ టైటిల్ విజేత నాదల్

- Advertisement -
- Advertisement -

అకపుల్కో: స్పానిష్ బుల్ రాఫెల్ నాదల్ వరసగా మూడో సారి మెక్సికో ఓపెన్ టెన్నిస్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. శనివారం ప్రిన్సెస్ ముండో ఇంపీరియల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో నాదల్ టేలర్ ఫిట్జ్‌ను 6 3, 6 2 వరస సెట్లలో సునాయాసంగా ఓడించి టైటిల్‌ను దక్కించుకున్నాడు. గతంలో 2005, 2013లలో క్లే కోర్టుల్లో ఈ టోర్నమెంట్‌ను నిర్వహించినప్పుడు కూడా నాదల్ టైటిల్ విజేతగా నిలిచాడు. ఇప్పుడు హార్డ్ కోర్టులలో టోర్నమెంట్‌ను నిర్వహించడం గమనార్హం. కాగా నాదల్‌కు ఇది కెరీర్‌లో 85వ టైటిల్ కావడం గమనార్హం.

Mexico Tennis title 2020 winner Rafael Nadal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News