Thursday, April 25, 2024

ఎద్దుల పోటీల్లో యువకుడు మృతి

- Advertisement -
- Advertisement -

Jallikattu

 

చిత్తూరు: ఎద్దుల పోటీలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సంక్రాంతి పండుగ సందర్భంగా రామకుప్పం మండలంలో పెద్దబల్దారు, చిన్నబల్దారు, కవ్వంపల్లి గ్రామాల మధ్యలో (జల్లి కట్టు) ఎద్దుల పోటీలు నిర్వహించారు. పలు ఎద్దుల యాజమానులు తన పశువులను పందెంలో ఉపయోగించారు. జల్లి కట్టు చూడాటానికి పెద్ద ఎత్తున స్థానికులు కర్నాటక, తమిళనాడు యువకులు తరలి వచ్చారు. ఎద్దును నిలువరించే క్రమంలో 89 పెద్దూరుకు చెందిన యువకుడు అబ్దుల్ బాషా తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే  బాషాను ఆస్పత్రి తరలించారు. మెడ కింద భాగంలో ఎద్దు కొమ్ము ఢీకొనడంతో బాషా మృతి చెందాడని వైద్యులు వెల్లడించారు. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఎద్దు యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడ ఎద్దుల పోటీ నిర్వహించిన తమకు తెలిపాలని పోలీసులు గ్రామాధికారులకు సూచించారు. అబ్దుల్ బాషా కుటుంబానికి ట్రైనీ కలెక్టర్ పృథ్వీ తేజ్ పరామర్శించారు. ప్రభుత్వ తరఫున పరిహారం ఇస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఎద్దుల పోటీల్లో యువకుడు చనిపోవడం బాధకరమైన విషయమని ఆయన కుటుంబాన్ని ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 

One Youth Dead in Jallikattu in chittoor District
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News