- Advertisement -
‘ఆపరేషన్ సిందూర్’ టైటిల్‌తో సినిమా రాబోతోంది. ఈ పేరుతో భారత ఆర్మీ ఏప్రిల్ 22న పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రస్తావరాలపై దాడులు చేసి ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ టైటిల్ కోసం బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు పోటీ పడ్డాయి. చివరికి ఈ టైటిల్ ను నిక్కీ విక్కీ భగ్నానీ ఫిల్మ్స్ సంస్థ దక్కించుకుంది. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా నిర్మాణ సంస్థ ప్రకటించింది. అంతేకాదు పవర్ ఫుల్ పోస్టర్ కూడా విడుదల చేసింది. యుద్ధ భూమిలో ఓ చేతిలో గన్ పట్టుకుని..మరో చేతితో నుదుటన సిందూరం పెట్టుకుంటున్న మహిళా కమాండర్ ను పోస్టర్ లో చూపించారు. ఈ సినిమాకు ఉత్తమ్ మహేశ్వరి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో నటించే వారి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
- Advertisement -