Friday, May 3, 2024

సిఎఎపై వ్యతిరేకత రాజ్యాంగ విరుద్ధం

- Advertisement -
- Advertisement -

చెన్నై: పౌరసత్వ సవరణ చట్టాన్ని (సిఎఎ) అమలు చేయబోమని కొన్ని రాష్ట్రాలు అనడం ‘రాజ్యాంగ విరుద్ధం’ అని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం చెప్పారు. పార్లమెంటు ఆమోదించిన చట్టం అమలయ్యేలా చూడడం రాష్ట్రాల బాధ్యత అని ఆమె చెప్పారు. ‘సిఎఎను వ్యతిరేకిస్తూ ఒక రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ఆమోదించింది. అది రాజకీయ తీర్మానం లాంటిదే అని మేము అర్థం చేసుకోగలం. కానీ, సిఎఎను అమలు చేయబోమని వారు చెబుతున్నారు. అలా అనడం చట్టవిరుద్ధం. రాజ్యాంగవిరుద్ధం’ అని నిర్మలా సీతారామన్ అన్నారు. సిఎఎకు సంబంధించి చెన్నై సిటిజన్స్ ఫోరం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ప్రేక్షకులు అడిగిన ఒక ప్రశ్నకు స్పందిస్తూ ఆమె ఈ సమాధానమిచ్చారు. కేరళ వంటి కొన్ని రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో సిఎఎ అమలు కాదని చెప్పారని నిర్మలా సీతారామన్ తెలిపారు. ‘సిఎఎ అమలు చేయబోమని రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయవచ్చు. కానీ రాజకీయ ప్రకటన మాత్రమే. కానీ వారు అమలు చేస్తే మేం కాదనం’ అని కేంద్ర ఆర్థికమంత్రి చెప్పారు.

Opposition CAA is Unconstitutional: Nirmala Sitharaman

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News