Thursday, May 2, 2024

జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధం: పవన్ కల్యాణ్

- Advertisement -
- Advertisement -

Pawan Kalyan press meet at Novotel

మన తెలంగాణ/హైదరాబాద్: ’ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేతత్వం లేకపోతే దోపిడీలు ఎక్కువైపోతాయని, ఒక తరానికి బాధ్యత గుర్తు చేయడానికి వచ్చానని, ఆ బాధ్యతను మేము తీసుకుంటామన్నారు. యుద్ధం మొదలయ్యిందని, యుద్ధాన్ని మీరు ప్రారంభించారు.. దాన్ని స్వీకరించేందుకు మేము సిద్ధంగా ఉన్నామ’ని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పారు. దెబ్బలు తినకుండా, జైళ్లకు వెళ్లకుండా, కేసులు పడకుండా రాజకీయాలు సాధ్యం కాదన్నారు. ప్రజల కోసం ఎన్ని కేసులనైనా స్వీకరిస్తానని, జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తాను అన్నింటికీ సిద్ధంగానే ఉన్నాను అని తెలిపారు. ప్రజల కోసం పోరాడితే నోటీసులు ఇస్తున్నారని అన్నారు. బూతులు తిట్టేవారు, భూదందాలు చేసే వారు, మర్డర్లు మానభంగాలు చేసే వారిని వెనకేసుకొస్తే ఇలాంటి వారే రాజ్యాలు ఏలుతారని అన్నారు. నేరమయ రాజకీయాలకి వైసీపీ ఉదాహరణ అని ఈ తరహా రాజకీయాలకి వ్యతిరేకంగా జనసేన పోరాటం చేస్తుందని అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌కు ఆదివారం మధ్యాహ్నం విశాఖ పోలీసులు నోటీసులు ఇచ్చారు. నెల రోజుల పాటు విశాఖ పరిధిలో సభలు, సమావేశాలు నిర్వహించడానికి అనుమతిలేదని నోటీసులో పేర్కొన్నారు. నోటీసులు తీసుకునే ముందు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘రాష్ట్రంలో గొంతులేని వారి మీద లా అండ్ ఆర్డర్ చాలా బలంగా పని చేస్తుందని విమర్శించారు. ఎదురుదాడి చేసే వారి మీద బలహీనంగా పని చేస్తుంది. ఇలాంటి వారు ప్రభుత్వం నడుపుతున్నారు. నాలాంటి వారి మీద కేసులు పెడితే ఎక్కడయినా చిన్న గ్రామంలో ఏదైనా జరిగితే రేపటి రోజున అడిగే వారు ఉండరని, ఎమర్జెన్సీ అనేది ప్రత్యేకంగా ప్రకటించాల్సిన అవసరం లేదు. గొంతు ఎత్తకుండా చేయడాన్ని మించి ఎమర్జెన్సీ ఏముంటుందన్నారు. గొంతు ఎత్తకూడదు అంటే ఇంకా ప్రజాస్వామ్యం ఏముందని నేర చరిత్ర ఉన్న వారిని ఎన్నుకుంటే వచ్చే సమస్య ఇదన్నారు. ప్రజాస్వామ్యం మీద వారికి నమ్మకం ఉండదు. కేవలం దౌర్జన్యం మీద నమ్మకం ఉంటుందని, చట్టాలు వారి చేతుల్లో ఉంటాయని, ఎవరూ ఏమీ మాట్లాడ కూడదన్నారు. అలా మాట్లాడకుండా ఉంటే అంచెలంచెలుగా దోచుకోవచ్చని ఎవరు ఎంత సంపాదించినా అడిగే వారు లేరన్నారు. మద్యపానాన్ని అంచెలంచెలుగా నిషేధిస్తామని ఇప్పుడు భారీగా అమ్మకాలు జరుపుతుంటే అడిగేవారు లేరన్నారు. అయినా ప్రజలకి కోపం రాదని నాయకులకీ అడిగే ధైర్యం లేదన్నారు. మూర్ఖంగా బూతులు తిట్టేసి మీదపడిపోవడాన్ని వాళ్లు పరిపాలన అనుకుంటున్నారని విమర్శించారు.
పవన్ కళ్యాణ్‌కు పలువురి సంఘీభావం
విశాఖపట్నం కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ అప్రజాస్వామిక విధానాలని అవలంభిస్తోందని, ఈ చర్యలను ఖండిస్తూ పలువురు సంఘీభావం తెలియచేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి మాట్లాడారు. ప్రభుత్వం పోలీసు శాఖను దుర్వినియోగం చేయడాన్ని తప్పుబట్టి, పార్టీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి, అరెస్టులను ఖండించినందుకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, పవన్‌తో ఫోన్లో సంభాషించారు. ప్రభుత్వ చర్యలను తప్పుబట్టారు. జనసేన పార్టీ నాయకుల అరెస్టులను ఖండించారు. మద్దతుగా నిలిచిన సోము వీర్రాజు బిజెపీ జాతీయ కార్యదర్శులు సునీల్ దేవధర్, సత్య కుమార్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

Pawan Kalyan press meet at Novotel

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News