Thursday, March 28, 2024

కాసేపట్లో ఎపి బిజెపి నేతలతో పవన్ భేటీ

- Advertisement -
Pawan Kalyan
అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ విజయవాడ బయల్దేరి వెళ్లారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకోనున్నారు. బిజెపి, జనసేన పార్టీల సమావేశం గురువారం ఉదయం 11 గంటలకు జరగనుంది. ఈ సమావేశంలో బిజెపి తరుపున కన్నా లక్ష్మీనారాయణ, సునీల్ ధియోధర్, జివిఎల్ నరసింహారావు, పురంధేశ్వరి, సోము వీర్రాజు పాల్గొననున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ బిజెపి ఆఫీసుకి పురంధేశ్వరి, సోము వీర్రాజు చేరుకున్నారు. పవన్‌తో సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నట్టు ఎపి బిజెపి వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాన్ బిజెపి నాయకుల భేటీ ప్రస్తుతం ఎపి రాజకీయాల్లో హాట్ టాఫిక్ మారాయి. రాష్ట్రంలో తాజా రాజకీయాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
దీంతో ఎపి రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయని చెప్పవచ్చు. ఈ సందర్భంగా  జివిఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడారు… వచ్చే నాలుగేళ్లలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చలు జరుపుతామన్నారు. అమరావతి, స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రమే తమ అజెండా కాదన్నా ఆయన… రాష్ట్రంలో అనేక పరిణామాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నమన్నారు. 2024 ఎన్నికల వరకు రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్లడంపై చర్చిస్తామని జివిఎల్‌ స్పష్టం చేశారు.
Pawan Kalyan To Meet BJP Leaders In Vijayawada
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News