Saturday, April 27, 2024

పెట్రోలు, డీజిల్ ధరల్లో 20 పైసల తగ్గింపు..

- Advertisement -
- Advertisement -

Petrol and Diesel prices decrease by 20 paise

న్యూఢిల్లీ: దాదాపు నెల రోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోలు, డీజిల్ ధరలు ఆదివానం స్వల్పంగా తగ్గాయి. లీటర్ పెట్రోల్, డీజిలుపై 20 పైసల వంతున ధరల్లో స్వల్పంగా ఆదివారం తగ్గాయి. పెట్రోలు ధరలో ఇది మొదటి తగ్గింపు కాగా, డీజిల్ ధరలో వారం రోజుల్లో నాలుగోసారి తగ్గింపు.ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ.101.64వంతున తగ్గగా, డీజిల్ ధర 89.07 కు తగ్గింది.ప్రపంచ చమురు మార్కెట్‌లో మే తరువాత ఇప్పుడు ధరలు తగ్గడంతో దేశీయ విక్రయసంస్థలు ధరల తగ్గింపునకు నిర్ణయం తీసుకున్నాయి. . 36 రోజుల తరువాత పెట్రోలు ధరలో 33 రోజుల తరువాత డీజిల్ ధరలోను తగ్గుదల వచ్చింది. జులై 18 నుంచి చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి మొత్తం 41 సార్లు పెట్రోధరలను పెంచిన విషయం తెలిసిందే. దాదాపు ఒక నెలపాటు రోజు విడిచి రోజు చమురు ధరలు పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో లీటరు పెట్రోలుధర రూ. 11.44, డీజిలు ధర రూ.8.74 మేర పెరగడం గమనార్హం.

Petrol and Diesel prices decrease by 20 paise

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News