Wednesday, August 6, 2025

కర్తవ్య భవన్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో ఉమ్మడి కేంద్ర సచివాలయ( సిసిఎస్) పథకంలో భాగంగా నిర్మించిన కర్తవ్య భవన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభించారు.ఈ ప్రాజెక్టు కింద మొత్తం 10 కార్యాలయ భవనాలను నిర్మించనున్నట్లు కేంద్ర గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ తెలిపింది. సిసిఎస్3గా పిలువబడే కర్తవ్య భవన్‌లోకి కేంద్ర హోమ్, విదేశీ వ్యవహారాలు, పెట్రోలియం శాఖ, డిఓపిటి, ప్రధానమంత్రికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయాలు తరలించనున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సిసిఎస్2. సిసిఎస్3 భవనాలు వచ్చే నెలలో పూర్తి కానుండగా, సిసిఎస్10 వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి,6వ,7వ భవనాలు అక్టోబర్ నాటికి పూర్తికానున్నాయి.2019లో ప్రారంభమైన సెంట్రల్ విస్టా ప్రాజెక్టు లో సిద్ధమైన తొలి భవనం కర్తవ్యభవనే కావడం గమనార్హం.

1950 70మధ్య కాలంలో నిర్మించిన శాస్త్రిభవన్, కృషి భవన్, నిర్మాణ్ భవన్, ఉద్యోగ్ భవన్‌లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను క్రమక్రమంగా ఈ భవనాల్లోకి మారుస్తారు.నిర్మాణం పూర్తయ్యే వరకు నాలుగు భవనాలనుంచి పని చేస్తున్న కేంద్ర కార్యాలయాలు రెండేళ్ల పాటు తాత్కాలికంగా కస్తూర్బా గాంధీ మార్గ్,మింటో రోడ్డు, నేతాజీ ప్యాలెస్‌లోని నాలుగు నూతన భవనాల్లోకి తరలివెళ్లనున్నట్లు కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ మంగళవారం చెప్పారు. కొత్త భవనాల్లో నేషనల్ మ్యూజియం, నేషనల్ ఆర్కైవ్స్, జవహర్‌లాల్ నెహ్రూ భవన్( కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్తి శాఖ, అంబేద్కర్ ఆడిటోరియం ఉన్నాయి. సెంట్రల్ విస్టా పునరాభివృద్ధిపథకం కింద ప్రభుత్వం ఇప్పటికే కొత్త పార్లమెంటు భవనం, ఉపరాష్ట్రపతి ఎన్‌క్లేవ్‌ను నిర్మించింది. విజయ్ చౌక్‌నుంచి ఇండియా గేట్ వరకు విస్తరించి ఉన్న కర్తవ్యమార్గాన్ని తిరిగి అభివృద్ధి చేసింది. కామన్ సెంట్రల్ సెక్రటేరియట్‌తో పాటుగా ప్రభుత్వం ఒక ఎగ్జిక్యూటివ్ ఎన్‌క్లేవ్‌ను కూడా నిర్మించనుంది.

దీనిలో ప్రధానమంత్రి కార్యాలయం(పిఎంఓ), క్యాబినెట్ సెక్రటేరియట్, ఇండియా హౌస్, జాతీయ భద్రతా మండలి ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ రెండో ఎన్‌క్లేవ్‌లో ప్రధానమంత్రి కొత్త నివాసాన్ని కూడా నిర్మిస్తారు. కర్తవ్యభవన్ మొత్తం ప్లింత్ ఏరియా 1.5 లక్షల చదరపు అడుగులు కాగా ఒక్క బేస్‌మెంట్ ఏరియా విస్తీర్ణమే 40 వేల అడుగులు ఉంది. ఇందులో 600 కార్లను పార్క్ చేయవచ్చు.ఈ భవనంలో ఒక క్రష్,యోగా రూమ్, మెడికల్ రూమ్ ఒక కేఫ్, ఒక వంటగది, అలాగే ఓ మల్టీపర్పస్ హాలు ఉన్నాయి. అంతేకాకుండా దీనిలో 24 మెయిన్ కాన్షరెన్స్ హాళ్లు, 26 చిన్న కాన్ఫరెన్స్ హాళ్లు, 27 లిఫ్టులు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News