Monday, June 3, 2024

మణిపూర్ ఘటన దేశానికే సిగ్గుచేటు: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన దేశానికే సిగ్గుచేటన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఎవరినీ వదిలిపెట్టబోమని తెలిపారు. గురువారం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు మీడియాతో మాట్లాడిన ప్రధాని మణిపూర్‌లో జరిగిన అమానవీయ ఘటనపై స్పందించారు.

‘మణిపూర్‌లో ఇద్దరు మహిళలపై జరిగిన అమానవీయ ఘటన నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటన 140 కోట్ల మంది భారతీయులను సిగ్గుపడేలా చేసింది.ఆ మణిపూర్ కుమార్తెలకు జరిగిన అన్యాయాన్ని ఎన్నటికీ క్షమించలేం. మహిళల భద్రత విషయంలో రాజీ పడబోం. నిందితులను విడిచిపెట్టబోమని దేశ ప్రజలకు భరోసా ఇస్తున్నా.ఈ ఘటనపై రాజకీయాలకు అతీతంగా స్పందించాలి. నిందితులను శిక్షించేందుకు చట్టం పూర్తిశక్తితో పని చేస్తుంది’ అని ప్రధాని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News