Saturday, October 12, 2024

గణపతి పూజను కూడా అంగీకరించలేకపోతున్నరు:ప్రధాని మోదీ

- Advertisement -
- Advertisement -

తాను గణపతి పూజ చేయడంపై కూడా కాంగ్రెస్ ఓర్వలేకపోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మండిపడ్డారు. ఇటీవల భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నివాసంలో గణేష్ చతుర్థి
సందర్భంగా నిర్వహించిన పూజలో మోడీ పాల్గొనడంపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. తాజాగా కాంగ్రెస్ విమర్శలపై ప్రధానిమోడీ ఫైరయ్యారు. మంగళవారం ఒడిశాలో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు.. సమాజాన్ని ముక్కలు చేసే పనిలో నిమగ్నమై ఉన్నాయని.. తాను గణేశుని పూజించడం వల్ల ఇబ్బంది పడతున్నారని సెటైర్ వేశారు.

“గణేష్ చతుర్థి మన దేశానికి కేవలం విశ్వాస పండుగ మాత్రమే కాదు. ఇది మన దేశ స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. బ్రిటీష్ వారు తమ అధికార దాహంతో దేశాన్ని విభజించి, కులం ప్రాతిపదికన విభజనలు సృష్టించి, సమాజాన్ని విషపూరితం చేస్తూ, “విభజించు, పాలించు” అనే విధానాన్ని తమ ఆయుధంగా ఉపయోగిస్తున్నప్పుడు, లోకమాన్య తిలక్ గణేష్ చతుర్థి బహిరంగ వేడుకల ద్వారా భారతదేశ ఆత్మను మేల్కొల్పారు. బ్రిటిష్ వారి కాలంలో గణేష్ చతుర్థి వారికి ముల్లులా మారింది. నేడు, అధికారం కోసం ఆకలితో ఉన్నవారు.. సమాజాన్ని విభజించి ముక్కలు చేయడంలో నిమగ్నమై ఉన్నవారు.. అందుకే గణేష్ ఆరాధనతో ఇబ్బంది పడుతున్నారు. నేను గణేష్ ఆరాధనలో పాల్గొన్నందుకు కాంగ్రెస్, మిత్రపక్షాలు అంగీకరించలేకపోతున్నారు” అని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News