Thursday, May 2, 2024

వలపు వల

- Advertisement -
- Advertisement -

Police Arrested Bharatpur Gang

దేశవ్యాప్తంగా దోచుకున్న నిందితులు
ఫేస్‌బుక్‌తో వల….వాట్సాప్‌లో ఛాటింగ్
నమ్మించి న్యూడ్ వీడియోల రికార్డ్
వాటిని చూపించి బ్లాక్‌మెయిల్
పరువు కోసం లక్షలాది రూపాయలు ఇచ్చిన బాధితులు

భరత్‌పూర్ ముఠా @25కోట్లు

హైదరాబాద్: న్యూడ్ వీడియోలు రికార్డు చేసి కోట్లాది రూపాయలు వసూలు చేసిన రాజస్థాన్‌కు చెందిన భరత్‌పూర్ ముఠా ఆగడాలు ఒక్కొక్కటి బయపడుతున్నాయి. న్యూడ్ వీడియోలు చూపించి దేశవ్యాప్తంగా పలువురు బాధితుల నుంచి రూ.25కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. వీరి బాధితులు దాదాపుగా 18 రాష్ట్రాల్లో ఉన్నట్లు తెలిసింది. ఈ ముఠాకు చెందిన నిందితులను ముందుగా రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేయగా, హైదరాబాద్ పోలీసులు ట్రాన్సిట్‌పై తీసుకుని వచ్చారు. వారిపై మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వందలాది కేసులు ఉన్నాయి. ఈ ముఠాకు చెందిన సభ్యులు ముందుగా ఫేస్‌బుక్ ఖాతాలో అందంగా ఉన్న యువతుల ఫొటోలు పెట్టి ఖాతాలు ఓపెన్ చేస్తున్నారు. తర్వాత వారి నుంచి బాధితులకు ఫ్రెండ్‌షిప్ రిక్వెస్ట్ పంపిస్తున్నారు.

దానిని ఆమోదించిన వారితో తరచూ ఛాటింగ్ చేస్తున్నారు, ఇలా వారం రోజులు ఛాటింగ్ చేసిన తర్వాత బాధితుల వాట్సాన్‌నంబర్ తీసుకుని ఛాటింగ్ చేస్తున్నారు. ఈ సమయంలో బాధితులతో సెక్సీగా మాట్లాడడం చేస్తుండడంతో చాలామంది వీరిని నమ్ముతున్నారు. తమను బాధితులు పూర్తిగా నమ్ముతున్నారని గ్రహించిన తర్వాత అసలు ప్లాన్‌ను అమలు చేస్తున్నారు. బాధితులకు వీడియోకాల్ ్స చేసి న్యూడ్‌గా మాట్లాడమని ప్రొత్సహిస్తున్నారు. బాధితుల కంటే ముందుగానే వారు న్యూడ్ తయారు అయి వీడియో కాల్ మాట్లాడుతున్నారు. మీరు కూడా న్యూడ్‌గా వీడియో కాల్ మాట్లాడాలని కోరుతున్నారు. బాధితులు అంగీకరించిన తర్వాత వారు దుస్తులు లేకుండా వీడియో కాల్స్ కొన్ని మాట్లాడిన తర్వాత వాటిని రికార్డు చేస్తున్నారు. వాటిని అడ్డుపెట్టుకుని గేమ్‌ను ప్రారంభిస్తున్నారు. బాధితులను బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు గుంజుతున్నారు. వీరి బాధితులు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉన్నారు, నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన వారు ఉన్నా బయటికి చెప్పుకోలేక లోలోపల కుమిలిపోతున్నారు.

సోషల్ మీడియానే ఆయుధం….

రాజస్థాన్, భరత్‌పూర్‌కు చెందిన ముఠా సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుని నేరాలు చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారానే బాధితులను కలుసుకుంటున్న నేరస్థులు. దానిని అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. నగ్నంగా వీడియోకాల్స్ మాట్లాడిన వాటిని రికార్డు చేసి డబ్బులు డిమాండ్ చే స్తున్నారు. తమకు డబ్బులు ఇవ్వకుంటే వీడియోలను సోషల్ మీడియాలో పెడుతామని బెదిరిస్తున్నారు. పరువు పోతుందని భావించిన చాలామంది బాధితులు వారు అడినట్లు లక్షలాది రూపాయలు ఇచ్చి బయటపడుతున్నారు.

చాలామంది పరువు పోతుందని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనుకాడుతున్నారు. పాతబస్తీకి చెందిన దుస్తుల వ్యాపారి ఇలాగే మోసపోయాడు. వీడియోలు సోషల్ మీడియాలో పెడుతానని బెదిరించడంతో రూ.1.50లక్షలు చెల్లించాడు. మళ్లీ ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాల్సిందిగా వేధించడంతో నగర సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన యువకుడిని ఇలాగే డబ్బుల కోసం వేధించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే తన మొబైల్ నంబర్ మార్చి ఊపిరి పీల్చుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News