Saturday, April 20, 2024

గంభీరావుపేట ఠాణాపై ఎసిబి దాడులు

- Advertisement -
- Advertisement -

Police caught to ACB

 

రాజన్న సిరిసిల్ల : గంభీరావుపేట పోలీస్ ఠాణాపై శుక్రవారం ఎసిబి అధికారులు దాడులు నిర్వహించి ఇసుక ట్రాక్టర్ యజమాని నుంచి లంచం తీసుకుంటున్న కానిస్టేబుల్ కనకరాజు, ఎస్సై అనిల్, సిఐ లింగమూర్తిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎసిబి డిఎస్పీ భధ్రయ్య మాట్లాడుతూ.. మాచారెడ్డి మండలానికి చెందిన సింహాచలం అనే వ్యక్తి తన వ్యక్తిగత అవసరాలకోసం గత నెలలో సిరిసిల్లలో ఇసుకను కొనుగోలు చేసి తన స్వంత వాహనంలో మాచారెడ్డికి తరలిస్తుండగా ఎల్లారెడ్డిపేట వద్ద సిఐ లింగమూర్తి పట్టుకుని గంభీరావుపేటకు తరలించాడు. అనంతరం సింహాచలం మరుసటి రోజు గంభీరావుపేట ఠాణాకు వెళ్లగా ఎస్సై అనిల్ అక్రమ ఇసుక రవాణా చేస్తున్నావని కేసు నమోదు చేశారు. అలా రెండు మూడు పర్యాయాలు తన వాహనం కోసం తిరిగిన సింహాచలాన్ని ఎస్సై అనిల్ డబ్బులు అరేంజ్ చేసుకో కేసు కాకుండా చూస్తాం అని గత నెల 27న తెలిపాడు.

దీంతో కానిస్టేబుల్ కనకరాజును సదరు బాధితుడు కలువగా అతను రూ. 25వేలు తీసుకరావాలంటూ తెలిపాడు. అంత ఇచ్చుకోలేనని బ్రతిమిలాడుకున్న సింహాచలం పదివేలు ఇస్తానని తెలిపారు. అయితే సిఐ వద్దకు వెళ్లి చెప్పుకోపో అని పంపగా అతను గత నెల 28న ఎల్లారెడ్డిపేట సిఐని కలిసి నేను రూ. 10వేలు ఇచ్చుకుంటాను సార్ అంతకంటే ఎక్కువ నాతో కాదు అని తెలిపాడు. దీంతో సరేనని సిఐ ఒప్పుకొని ఎస్సైకి సమాచారం అందించాడు. అయినప్పటికీ ఎన్ని సార్లు ఠాణా చుట్టు తిరిగినా కానీ తనకు పని జరుగక పోవడంతో గురువారం రోజున సింహాచలం ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. వారి సలహా ప్రకారం శుక్రవారం కానిస్టేబుల్ కనకరాజుకు రూ. 10వేలు ఇస్తుండగా ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపారు. కెమికల్ ఎగ్జామిన్ చేసి సిఐ లింగమూర్తి, ఎస్సై అనిల్, కానిస్టేబుల్ కనకరాజుపై కేసు నమోదు చేసి శనివారం ఎసిబి కోర్టులో హాజరుపరుస్తామని పేర్కొన్నాడు.

Police caught to ACB while taking Bribe
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News