Friday, March 29, 2024

గీత దాటితే వాతే

- Advertisement -
- Advertisement -

police take action against violation traffic rules

– ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై చర్యలు
– డిపార్ట్‌మెంట్ వారికీ జరిమానా విధిస్తున్న ట్రాఫిక్ పోలీసులు
– కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్న
హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు

హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులపై పోలీసులు కఠింగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు నిబంధనలు పాటించకున్నా జరిమానాలు విధిస్తున్నారు. నిబంధనలు పాటించని వారు పోలీసులైనా, సామాన్యులైనా ఒక్కటేనని స్పష్టం చేస్తున్నారు. విధి నిర్వహణలో కూడా పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందేనని తెలుపుతున్నారు. చాలామంది వా హనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ పెట్టుకోకపోవడం, సిగ్నల్ జంప్ చేయడం తదితరాలను ఉల్లంఘిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు తమ వారిపై కూడా జరిమానా విధిస్తున్నారు. విధి నిర్వహణలో బయటికి వెళ్లినా సరే తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని తెలుపుతున్నారు.

సిసిటివి ఆధారంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించని పో లీసులకు జరిమానా విధిస్తున్నారు. చాలామంది సైబరాబాద్, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సోషల్ మీడియా ఖాతాలను అనుసరిస్తున్నారు. అందులో నిబంధనలు ఉల్లంఘించిన వారి ఫోటోలు సామాన్యులు పొస్టు చేస్తుండడంతో వెంటనే స్పందిస్తున్న పోలీసులు వివరాలు అడిగి పోలీసులకు జరిమానా విధిస్తున్నారు. పోలీసులకు జరిమానాకు సంబంధించిన వివరాలు, ఎక్కడ ఎప్పుడు నిబంధనలు ఉల్లంఘించింది స్పష్టంగా పేర్కొంటున్నారు. ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో చాలామంది మృతిచెందుతుండడంతో పోలీసులు నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు.

సైబరాబాద్‌లో ఇద్దరికి హెల్మెట్లు…

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో కానిస్టేబుళ్లకు పెట్రోలింగ్ నిర్వహించేందుకు బైక్‌లను ఇచ్చారు, అలాగే విధి నిర్వహణకు కూడా వాటిని వాడుతున్నారు. ఇలా వారు విధి నిర్వహణలో బయటికి బైక్‌పై వెళ్లితే ఇద్దరు హెల్మెట్‌ను ధరించేలా చర్యలు తీసుకున్నారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోనే వారికి హెల్మెట్లు ఇస్తున్నారు. తప్పనిసరిగా హెల్మెట్లు పెట్టుకుని వెళ్తున్నారు, ఒకవేళా నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తున్నారు. ఇప్పటి వరకు చాలామంది పోలీసులకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News