Thursday, March 20, 2025

ఇది యుద్ధపు దారుణ అజెండా

- Advertisement -
- Advertisement -

Pope kisses Ukrainian flag

ఉక్రెయిన్ జెండాను ముద్డాడిన పోప్

వాటికన్ సిటీ : బుచాలో దెబ్బతిని పడిపోయిన ఉక్రెయిన్ జాతీయ జెండాను వాటికన్ సిటిలో పోప్ ప్రాన్సిస్ ముద్దాడారు. బుచాలో దారుణకాండను పోప్ దృష్టికి తెచ్చేందుకు ఉక్రెయిన్‌కు చెందిన ఆరుగురు చిన్నారులు వాటికన్ వచ్చారు. ఇక్కడి వాటికన్ ఆడియన్స్ హాల్‌లో వారి చేతుల్లో ఉక్రెయిన్ జెండా ఉంది. వడలిపోయి దెబ్బతిని ఉన్న ఈ జెండాను పిల్లలు పోప్ చేతికి అందించారు. ఇది తమ దేశ పరిస్థితి అని చెప్పకనే చెప్పారు. ఈ జెండాను కళ్లకు అద్దుకుని పోప్ ముద్దాడారు. అక్కడికి వచ్చిన బాలలకు భారీ చాక్లెట్ ఈస్టర్ ఎగ్ బహుకరించారు. ఉక్రెయిన్ల కోసం అంతా ప్రార్ధించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిల్లలు సురక్షిత ప్రాంతాలు వెతుక్కుంటూ కండ్లలో గుండెలు పెట్టుకుని ఇక్కడికి చేరారు. ఇదే యుద్ధ ఫలం. దీనిని మించి ఏదీ చేదుగా ఉండదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News