నూతనకల్ : పిఓడబ్లు జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక ప్రగతి శీల సంఘం ఆధ్వర్యంలో నూతనకల్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతనకల్ ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలతో సతమతమవుతుందని, ముఖ్యంగా ఒక నర్సు ఒక డాక్టర్‌తో కలిగి సరైన సిబ్బంది లేక పేషెంట్లకు సరైన వైద్యం అందించలేక పోతున్నారని అన్నారు. ఈ మండలానికి 22 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.
కానీ ఒక్క 108, 104 వాహనాలు లేక సరైన టైంకి పేషెంట్లు టైంకి రాలేక పోతున్నారని అన్నారు. తక్షణమే నియోజకవర్గ ఎంఎల్ఏ గాదరి కిషోర్ కల్పించుకుని యుద్ధ ప్రాతిపదికన వైద్యుడిని, గైనకాలజిస్టును మరో ముగ్గురు నర్సులను నియమించి వాహన సౌకర్యం కల్పించి ఇతర సమస్యలు పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిఓడబ్లు జిల్లా అధ్యక్షులు చంద్రకళ, రేణుక, సంతోషి, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.