Saturday, April 20, 2024

రేవంత్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకో: ఎంఎల్ఎ గాదరి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రేవంత్‌రెడ్డి సోమవారం బాల్కొండలో ఇష్టమొచ్చినట్టు మాట్లాడారని, రేవంత్‌ది పాదయాత్ర కాదనీ, కాంగ్రెస్‌కు పాడకు కట్టే యాత్ర అని ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ ఆరోపించారు. ఎమ్మెల్సీ డి. రాజేశ్వర్‌రావుతో కలిసి బిఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో గాదరి మాట్లాడారు. ఎక్కడికి పోతే అక్కడి ఎమ్మెల్యేలను తిడుతున్నారని, రేవంత్ రెడ్డి వృత్తి బ్లాక్ మెయిలింగ్ అని, రేవంత్ రాజకీయ వ్యభిచారి అని, ఓ బ్రోకర్ అని, సచివాలయం, అమర వీరుల స్మారక కేంద్రం, బిఆర్ అంబేడ్కర్ విగ్రహ నిర్మాణంలో అవినీతి అంటూ ఆధారాలు లేకుండా మాట్లాడారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

సమాచార హక్కు చట్టాన్ని బ్లాక్ మెయిలింగ్‌కు వాడుకునే రేవంత్ ఇప్పుడు కూడా వీటిపై సమాచారం తీసుకోవచ్చని ఆయన సూచించారు. తెలంగాణ అమరవీరుల గురించి మాట్లాడే హక్కు రేవంత్‌కు ఎక్కడిదని, తెలంగాణ అమరవీరులకు కారణం రేవంతే కదా అని, చంద్రబాబు సంకలో జొర్రీ తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆయన పేర్కొన్నారు.
పెయింటర్‌గా జీవితం ప్రారంభించిన రేవంత్‌కు
పెయింటర్‌గా జీవితం ప్రారంభించిన రేవంత్‌కు ఇన్ని ఆస్తులు ఎక్కడివని ఆయన ప్రశ్నించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డిని అవినీతిపరుడని విమర్శిస్తావా, ప్రశాంత్ రెడ్డి గురించి వాళ్ల నాన్న సురేందర్ రెడ్డి గురించి నిజామాబాద్ జిల్లాలో ఎవరిని అడిగినా చెబుతారని, జిఎస్టీ రేట్లు 6 శాతం నుంచి 18శాతం పెరిగాయని, అంచనా వ్యయాలు పెరిగితే పెరిగి ఉండవచ్చని ఆయన తెలిపారు. కెసిఆర్ పాలనలో అవినీతికి చోటు లేదన్నారు.

రాహుల్ గాంధీతో మల్లికార్జున ఖర్గేతో ఎప్పుడైనా అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించజేశావా అని రేవంత్‌ను ఆయన ప్రశ్నించారు. రేవంత్ పిచ్చి ప్రేలాపనులు చేస్తే తన్ని తరిమేస్తారని, కమీషన్లు రేవంత్‌కు కాంగ్రెస్‌కు అలవాటు అని ఆయన ఆరోపించారు. తమ లాగే అందరూ అవినీతి చేస్తారని రేవంత్ అనుకుంటున్నారని, రేవంత్‌ను మించిన పొలిటికల్ బ్రోకర్ ఎవ్వరూ లేరని ఆయన పేర్కొన్నారు.
కెసిఆర్ పాలన దేశానికి రోల్ మోడల్ : ఎమ్మెల్సీ
ఎమ్మెల్సీ డి. రాజేశ్వర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ పాలన దేశానికి రోల్ మోడల్ అయ్యిందన్నారు. దేశానికి ఎవ్వరూ వచ్చినా తెలంగాణనే ముందు సందర్శిస్తున్నారన్నారు. అమర వీరుల ఆత్మలు రేవంత్ వ్యాఖ్యలతో ఘోషిస్తున్నాయన్నారు. ప్రశాంత్ రెడ్డి కాలి గోటి కి కూడా రేవంత్ సరిపోరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అమర వీరుల స్మారక కేంద్రం వ్యయం పెరగడానికి స్టీల్, సిమెంట్ రేట్లు పెరగడమే కారణమన్నారు. సచివాలయానికి ఇప్పటి వరకు రూ.470 కోట్లు ఖర్చయ్యిందన్నారు.

వాస్తవాలు వక్రీకరించొద్దని, పిసిసి అధ్యక్షుడిగా ఉండి బుద్ది జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. రేవంత్ ఓటుకు నోటుకు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని రాబోయే రోజుల్లో రేవంత్‌కు జైలులో చిప్ప కూడే గతి అని ఆయన పేర్కొన్నారు. ప్రశాంత్ రెడ్డికి రేవంత్‌కు నక్కకు నాగ లోకానికి ఉన్న తేడా ఉందన్నారు. రేవంత్ ఉండేందుకు జైలే అనువైన స్థానమని, ప్రజా క్షేత్రం కాదనీ, రేవంత్‌ను తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News