Saturday, July 27, 2024

కుర్రకారు మతిపోగొడుతున్న ప్రగ్యా..

- Advertisement -
- Advertisement -

‘కంచె’ సినిమాలో ‘ఏయ్ మిస్టర్..’ అంటూ క్యూట్‌గా సీత పాత్రలో కనిపించి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌నే కాదు కుర్రకారును మైమరపించిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ను కూడా తన ఖాతాలో వేసుకుంది. ఎంట్రీ ఘనంగా ఉన్నా తదుపరి అవకాశాలు అంతంత మాత్రంగానే ఆమెకు లభించాయి. ఆతర్వాత ఒకటీ అరా సినిమాల్లో నటించినా అవేమీ పెద్దగా పేరు తెచ్చిపెట్టలేకపోయాయి ప్రగ్యా జైస్వాల్‌కి. అయితే అవకాశాలను ఒడిసి పట్టుకునేందుకు గత కొంత కాలంగా ఈ భామ సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా దర్శనమిస్తూ సందడి చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఓ బికినీ ఫొటోను పోస్ట్ చేసింది. పింక్ హాట్ బికినీ ధరించి బీచ్‌లో వయ్యారాలు ఒలకబోసింది. కళ్లు చెదిరే ఫిగర్ కావడంతో బికినీ ఈ భామకు సరిగ్గా సరిపోయిందని ఈ ఫొటోను చూసిన నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Pragya Jaiswal hot looks in Pink Bikini

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News