Saturday, July 27, 2024

‘ఎఫ్-3’లో ప్ర‌గ్యా జైస్వాల్ స్పెష‌ల్ సాంగ్‌..?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్ లో కన్నడ బ్యూటీస్ హావా కొనసాగుతుండడంతో పూర్తిగా వెనకపడిపోయిన పొడుగు కాళ్ల సుందరి ప్రగ్యా జైస్వాల్‌ మళ్లీ బిజీ అవుతోంది. ఈ క్రమంలోనే ఓ స్పెషల్ సాంగ్ తో తెలుగు అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎఫ్‌-3’లో ప్రగ్యా ఓ స్పెషల్ సాంగ్ లో మెరువనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ పాటలో వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ లతో కలిసి చిందేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇక, బాలకృష్ణ తాజా చిత్రం ‘అఖండ’లో ప్రగ్యా కథానాయికగా నటిస్తోన్నంది. దీంతోపాటు మోహన్‌బాబు ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’లో కీలక పాత్రలో నటిస్తుంది. ఇలా వరుస అవకాశాలు దక్కించుకుంటున్న ప్రగ్యా మరోసారి టాలీవుడ్ లో సత్తా చాటాలని భావిస్తోంది.

Pragya Jaiswal special song in F3 Movie?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News