Saturday, April 27, 2024

ఆ స్టార్‌తో మరోసారి…

- Advertisement -
- Advertisement -

Pranitha to pair with Pawan Kalyan's 28th movie?

డైరెక్టర్ క్రిష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు అనగానే ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతం ఉందట. ఇక ఓ యువతి పవన్ ప్రేమలో పడుతుందని.. కాగా ఆ ప్రేమించే హీరోయిన్‌గా ప్రణీత సుభాష్ నటించబోతుందని తెలిసింది. ఇప్పటికే ఈ భామ పవన్ సినిమా ‘అత్తారింటికి దారేది’లో నటించి మైమరపించింది. ఇప్పుడు ఆమె మరోసారి పవర్‌స్టార్ మూవీలో నటించనుందట. కాగా పిరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే చిత్రమిది. ఇందులో పవన్ రాబిన్‌హుడ్ తరహా పాత్రలో కనిపిస్తాడని సమాచారం. అన్నట్టు ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే పేరును అనుకుంటున్నారట. అయితే చిత్ర బృందం నుండి మాత్రం ఇంకా ఎలాంటి అప్‌డేట్ వెలువడలేదు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక పవన్‌కళ్యాణ్ ఇటు రాజకీయాలతో పాటు అటు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను కూడా ఒప్పుకున్నాడు. ఇప్పటికే వేణు శ్రీరామ్, క్రిష్‌లతో చేస్తోన్న సినిమాలతో పాటు హరీష్ శంకర్ సినిమా కూడా పవన్ అంగీకరించాడు.

Pranitha to pair with Pawan Kalyan’s 28th movie?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News