Thursday, May 9, 2024

వియన్నాలో ఉగ్రదాడి: ఐదుగురి మృతి

- Advertisement -
- Advertisement -

 

వియన్నా: ఆస్ట్రియాలోని సెంట్రల్ వియన్నాలో సోమవారం 20 ఏళ్ల యువకుడు దుండగులు కాల్పులకు తెగబడ్డాడు. ఈ దుర్ఘటనలో ఆ హంతకునితోపాటు ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, 17 మంది గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, మరో ఇద్దరు మహిళలు ఉన్నారు. వియన్నాలో లాక్‌డౌన్ ప్రారంభమవుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. హంతకుడు కుజిటిమ్ ఫెజులాయి ఆస్ట్రియాఉత్తర మెసిడోనియా ద్వంద్వపౌరసత్వం కలిగిన వాడు. దాడి జరిగిన తరువాత పోలీసులు అతణ్ణి కాల్చి చంపారు. గాయపడిన 17 మందిలో ఏడుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇది ఇస్లామిక్ ఉగ్రదాడిగా పోలీసులు నిర్ధారించారు. సైద్ధాంతిక విద్వేషంతో ఈ దాడి జరిగిందని చెప్పారు. దాడికి పాల్పడిన వ్యక్తి ఉత్తరమెసిడోనియాకు చెందిన బాల్కన్ జాతీయుడని, ఇది వరకు ఉగ్రకార్యకలాపాలు నిర్వహించాడన్న నేరంపై శిక్ష పొందాడని విదేశాంగ మంత్రి కరి నెహమ్మెర్ చెప్పారు. ఈ దాడికి సహకరించిన వారు పరారీలో ఉన్నారన్న అనుమానంతో పోలీసులు మరి కొందరి కోసం గాలిస్తున్నారు.

5 Killed after Terror Attack in Vienna

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News