Monday, May 6, 2024

ఫార్మాకు ప్రాధాన్యం

- Advertisement -
- Advertisement -

Minister KTR unveiled Telangana Life Science Vision 2030

 

లైఫ్ సైన్సెస్ హబ్‌గా హైదరాబాద్

ఆసియాలో అగ్రగామిగా నిలుపుదాం
రానున్న 10ఏళ్లలో ప్రభుత్వం తరపున ప్రయోజనకర చర్యలు
తెలంగాణ లైఫ్ సైన్సెస్ విజన్ 2030 ఆవిష్కరించిన మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్‌ను ఆసియాలోనే అగ్రగామిగా నిలుపుతామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తోందన్నారు. రానున్న పది సంవత్సరాల్లో పెద్ద ఎత్తున హైదరాబాద్‌కి భారీ పెట్టుబడులను లైఫ్ సైన్స్‌స్ రగంలో ఆకర్శించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రూపొందించిన తెలంగాణ లైఫ్ సైన్సెస్ విజన్- 2030 నివేదికను ఆయన ఆవిష్కరించారు. మంగళవారం ప్రగతి భవన్‌లో మంత్రి కెటిఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర లైఫ్ సైన్సెస్ సలహా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సభ్యులుగా ఉన్న ఫార్మా కంపెనీల అధిపతులు, ఫార్మా నిపుణులు, విద్యా సంస్థల అధిపతులు పలువురు హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగానికి చెందిన పరిస్థితులతో పాటు భవిష్యత్తులో ఈ రంగం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల పైన విస్తృతంగా చర్చించారు. రానున్న పది సంవత్సరాల్లో ఎలాంచి చర్యలు తీసుకుంటే మరింత ప్రయోజనంగా ఉంటుంది? ఈ రంగంలో అదనపు పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల కల్పన దిశగా ఏ విధంగా ముందుకు వెళ్లాలి? తదితర అంశాలపై కూడా చర్చించారు. ఇందులో ప్రభుత్వం నుంచి పరిశ్రమ ఆశిస్తున్న చర్యలపైన వారు మంత్రి కెటిఆర్‌కు వివరించారు.

వీటన్నిటి పైన సానుకూలంగా స్పందించిన మంత్రి కెటిఆర్‌ర్ భవిష్యత్తులోనూ ఫార్మా రంగం పెట్టుబడుల ఆకర్షణ, అభివృద్ధిలో ప్రభుత్వ ప్రాధాన్యతా రంగంగా కొనసాగుతుందని తెలియజేశారు. లైఫ్ సైన్సెస్ రంగంలోని భాగస్వాములతో పాటు పెట్టుబడిదారులు, విద్యారంగ నిపుణులు, సలహాదారులు, ప్రభుత్వ అధికారులు, ఇతర అనుబంధ సంస్థల తో విస్తృతంగా చర్చించి ఈ నివేదికను రూపొందించినట్లు తెలిపారు. ఈ నివేదిక పాలసీ పరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని మంత్రి కెటిఆర్ అన్నారు.

ఆసియాతో పాటు ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన లైఫ్ సైన్సెస్ పెట్టుబడి గమ్యస్థానంగా రాష్ట్రాన్ని మలిచేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల కోసం కలిసివచ్చిన లైఫ్ సైన్సెస్ భాగస్వాములు అందరికీ మంత్రి కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు. కాగాఈ సందర్భంగా రూపొందించిన నివేదికను పరిశ్రమ అభిప్రాయాలను లైఫ్ సైన్సెస్ అడ్వైజరీ కమిటీ చైర్మన్, డాక్టర్ రెడ్డీస్ సంస్థ అధిపతి అయిన సతీష్ రెడ్డి మంత్రికి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, లైఫ్ సైన్స్ రంగంలో ప్రభుత్వం తో కలిసి పరిశ్రమ పనిచేస్తుందన్నారు.

ప్రభుత్వ ఆలోచనల మేరకు ఈ రంగాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు తామంతా కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. పదేళ్లలో ఆసియా ఖండంలో అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా మారెందుకు హైదరాబాద్‌కు అన్ని అనుకూలతలు ఉన్నాయన్నారు. ప్రధానంగా హైదరాబాద్‌లో దొరికే నైపుణ్యం కలిగిన మానవ వనరులు, సాంకేతిక నైపుణ్యాలు, నాణ్యమైన మౌలిక వసతులు కూడా ఉన్నాయన్నారు. అలాగే తాము నిర్ణయించుకున్న లక్ష్యాలను సాధించేందుకు అత్యంత ఆసక్తి చూపించే ప్రభుత్వ నాయకత్వం ఇక్కడ ఉండటం వలన ఇది సాధ్యమవుతుందని సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో అడ్వైజరీ కమిటీ లో భాగస్వాములుగా ఉన్న సభ్యులు హైదరాబాద్ రీసెర్చ్, ఇన్నోవేషన్, నైఫర్ సంస్థ విసితో పాటు ఇతర ఫార్మా రంగ నిపుణులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News