Sunday, April 28, 2024

దుబ్బాక ప్రశాంతం

- Advertisement -
- Advertisement -

Dubbaka polling ended peacefully

 

82.61% పోలింగ్

పోలింగ్ కేంద్రాలకు బారులుతీరిన ఓటర్లు
89 సమస్యాత్మక కేంద్రాల్లో పటిష్ట భద్రత
చివరి గంటలో పిపిఇ కిట్లు ధరించి ఓటేసిన కొవిడ్ రోగులు, 10న కౌంటింగ్

మన తెలంగాణ/హైదరాబాద్ : దుబ్బాక ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నప్పటికీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు 82. 61 శాతం పోలింగ్ నమోదైంది. కోవిడ్ పేషె ంట్లు ఓటు హ క్కు వినియోగించుకోవడానికి సాయంత్రం 5గ ంటల నుంచి ఆరు గంటలవరకు అనుమతించా రు. దుబ్బాక నియోజకవర్గంలో మంగళవారం పోలింగ్ ప్రశాంత ంగా జరిగింది. ఓటర్లు ఉద యం 7 గంట ల వరకే పోలింగ్ కేంద్రాల్లో బారులుతీరా రు. కోవిద్ నిబంధనల మేరకు ఆరు మీ టర్లకు ఒకరు చొప్పున గీసిన గీతల్లో ఓటర్లు ని లబడి తమ హక్కును వినియోగించుకున్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని దు బ్బాక, తొగుట, మిరుదొడ్డి, దౌలతాబాద్, చే గుంట, నార్సింగ్‌లో మండలాల్లో పోలింగ్ కోసం ఏర్పాటు చేసిన 315 పోలింగ్ కేం ద్రాల దగ్గర ఎన్నికల కమిషన్ పటిష్టమైన ఏ ర్పాట్లు చేయడంతో ఓటర్లు ప్రశా ంత వాతావరణంలో తమ హక్కును వినియోగించుకోగలిగారు.

పోలింగ్ కేంద్రాల వెలుపల, లో పల సిసి కెమెరాలు ఏర్పాటు చేయడంతో పా టు గా పోలీసులు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు ఇ చ్చారు. పోలింగ్ కేంద్రాలకు చేరకున్న వారం తా ఓటు హక్కువినియోగించు కోగలిగారు. సా యంత్రం 5 గంటల నుంచి ఆరు గటంల వరకు కరోనా పాజిటివ్ వచ్చిన వారు ఓటు హక్కు విని యోగించుకున్నారు. పిపిఇ కిట్లు, గ్లౌజులు ధ రించి శానిటైజర్స్ వినియోగించిన అనంతరమే వారిని ఓటుకు అనుమతించారు. మధ్యాహ్నం ఓం టి గంటకు 55.52 శాతం, మూడుగంటలవరకు 71.10 శాతం పోలింగ్ కాగా సాయ ంత్రం 4 గంటలవరకు 78 శాతం పోలింగ్ అయింది. సాయంత్రం 5 గంటలకు 81.44 శాతం పోలింగ్ నమోదు అయింది. సాయంత్రం ఆరుగంటలకు 82.61 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఎన్నికల్లో 23 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నోటాతో కలిపి ఇవిఎం బ్యాలెట్‌పై 24 గుర్తులు ఉన్నాయి. పోలింగ్ కేంద్రంలోపల అధికారులు, రాజకీయ పార్టీలనుంచి అనుమతి పొందిన ఏజెంట్లు మినహా ఎవరినీ అనుతించలేదు.

ప్రధానంగా బీడికార్మికులు, చేనేత కార్మికులు, యువత, రైతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 89 సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల్లో భద్రతా చర్యలను పటిష్టంగా ఎన్నికల కమిషన్ అమలు చేసింది. మూడు అంచల భద్రతను ఏర్పాటు చేయడంతో పాటుగా సివిల్ పోలీసుల నిఘాపెంచారు. 33 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. జిల్లా కలెక్టర్ భారతీహోళీకేరి ఎన్నికల ప్రత్యేకాధికారి హోదాలో సమస్యాత్మకమైన 89 పోలింగ్ కేంద్రాలు. అత్యంత సమస్యాత్మకమైన 33 పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అధికారులకు సూచనలు ఇచ్చారు. లచ్చపేటలోని దుబ్బాక జిల్లా పరిషత్ హైస్కూల్లోని పోలింగ్ కేంద్రంలో ఇవిఎం మెరాయించిందనే సమాచారంతో కలోక్టర్ తక్షణం పరిశీలించారు. అది కేవలం పుకారు మాత్రేనని ఆమెచెప్పారు. థర్మల్ స్రీనింగ్ చేసి శానిటైజర్ ఉపయోగించిన అనంతరమే ఓటర్లు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లాలని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను ఖచ్చితంగా ధికారులు అమలు చేశారు.

టిఆర్‌ఎస్ సమీక్ష

దుబ్బాక పోలింగ్ సరళిని సిద్దిపేటలోని తన నివాసం నుంచి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు సమీక్షించారు. శాసనసభ్యులు క్రాంతి కిరణ్,చింత ప్రభాకర్, దేవేందర్ రెడ్డి, వివిధ మండలాల టిఆర్‌ఎస్ నాయకులతో కలిసి ఆయన పోలింగ్ సరళిని సమీక్షించారు. తొగుట మండలం వెంకట్రావుపేటలో పోలింగ్ కేంద్రంలో ఇవిఎం మొరాయించినట్లు సమాచారం రాగానే ఆయన అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. ఓటింగ్ సరళిని పరిశీలించిన హరీశ్‌రావు టిఆర్‌ఎస్ భారీ మెజారిటీతో గెలువనుందనే ధీమాను వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు తమపరిధిలో ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకున్నప్పటికీ అధికార యంత్రాంగం కూడా ప్రతినిమిషం ఎంతో అప్రమత్తంగా పోలింగ్‌ను సమీక్షించింది. మైక్రో పరిశీలకులు డేగ కళ్లతో వీక్షించి అధికారులకు సూచనలు చేశారు. ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ దుబ్బాక ఎన్నికలను పరిశీలించారు. టిఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతారెడ్డి తమ స్వగ్రామమైన చిట్టాపూర్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

దుబ్బాక ఓటర్లలో మహిళలు అధికంగా ఉండటంతో పాటుగా పోలింగ్ కేంద్రల దగ్గర మహిళలు బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నియోజక వర్గంలోని 148 గ్రామాల్లో మొత్తం ఓటర్లు 1,98,807 ఉండగా అందులో పురుష ఓటర్లు 98,028, మహిళ ఓటర్లు 1,00,719 మహిళ ఓటర్లు ఉన్నారు. అయితే మహిళా ఓటర్లు దాదాపుగా టిఆర్‌ఎస్ పక్షానే ఉన్నారు. మహిళల్లో బీడికార్మికులు, చేనేత కార్మికులు, వ్యవసాయకూలీలు అధికంగా ఉన్నారు. వీరంతా మొదటి నుంచి టిఆర్‌ఎస్ పక్షంలోనే ఉండటంతో టిఆర్‌ఎస్ విజయం ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ సంక్షేమపథకాల ఫలాలు అనుభవిస్తున్న వారంతా సిఎం కెసిఆర్‌ను ఆశీర్వదిస్తూ టిఆర్‌ఎస్‌కు ఓటువేసినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.

ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం : శశాంక్ గోయల్

దుబ్బాక ఎన్నికల సందర్భంగా రాజకీయపార్టీలు చేసుకున్న ఫిర్యాదులపై దర్యాప్తు చేస్తున్నట్లు శశాంక్ గోయల్ చెప్పారు. దుబ్బాకలో నాన్‌లోకల్ వారు ఎవరూ లేరని చెప్పారు. అయితే ఇప్పటివరకు ఎంఎల్‌ఎపై దాడి జరిగిందని ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. చెదురుమదురు సంఘటనలు మినహా దుబ్బాక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయన్నారు. పోలింగ్ ముగియడంతో పటిష్టమైన భద్రతతో ఇవిఎంలను స్ట్రాంగ్ రూంకు తరలించామని చెప్పారు. నవంబర్ 10న ఓట్ల లెక్కింపుకు సంబంధించి అధికారులకు, సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు.

ఓటు హక్కు వినియోగించుకున్న టిఆర్‌ఎస్, బిజెపి, కాంగ్రెస్ అభ్యర్థులు

దుబ్బాక ఉపఎన్నికల పోలింగ్‌లో ఇండిపెండెంట్ అభ్యర్థులతో కలిసి వివిధపార్టీల నుంచి 23 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మంగళవారం పోలింగ్ ప్రారంభమైన అనంతరం మధ్యాహ్నం వరకు పోటీలో ఉన్న అబ్యర్థులందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రధానంగా పోటీలో ఉన్న అభ్యర్థుల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో ఓటువేశారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి తొగుట మండలంలోని తుక్కాపూర్‌లో చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, బిజెపి అభ్యర్థి రఘునందన్‌రావు బొప్పాపూర్ గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మండలాలవారిగా పోలింగ్ శాతం

దుబ్బాక నియోజకవర్గంలోని ఏడుమండలాల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వివరాలు ఇలా ఉన్నాయి. దుబ్బాకలో 55208 ఓటర్లు ఉండగా 44700 ఓటు హక్కు వినియోఇంచుకున్నారు, ఆలాగే మిరుదొడ్డిలో 31762 ఓటర్లకు 25645, తొగుటలో 26751 ఓటర్లకు 22081, దౌలతాబాద్‌స లో 23032 ఓటర్లకు 19460, రాయపోల్ లో 20613 ఓటర్లకు 16856,చేగుంట 32829 మంది ఒటర్లకు 26020, నార్సింగ్ 8215 ఓటర్లకు 6785,గజ్వల్ 446 ఓటర్లకు 353 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

స్రాంగ్‌రూం వద్ద మూడంచెల భద్రత
సిసి కెమెరాలతో నిఘా

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక ఓటింగ్ పూర్తికావడంతో ఇవిఎంలను కట్టుదిట్టమైన భద్రతతో స్ట్రాంగ్ రూంలకు తరలించారు. ఈక్రమంలో స్ట్రాంగ్‌రూం వద్ద మూడంచెల భద్రతతో పాటు పెద్ద ఎత్తున సిసి కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని సిద్ధిపేట సిపి జోయల్ డేవిస్ పేర్కొన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల ఓటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన ఏర్పాటు చేయడంతో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయన్నారు. ఉప పోరులో రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాలతో కలిపి మొత్తం 2 వేల మంది ఉప ఎన్నిక బందోబస్తులో పాల్గొన్నారని తెలిపారు. సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన చోట అదనపు బలగాలు, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారమన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News